X
రంగబలి
Comedy | Drama | 07 Jul 2023 | U | 130 Mins
Telugu

రంగబలి స్టోరీ

రంగబలి మూవీ కామెడీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, యుక్తి తరేజా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పవన్ బసంశెట్టి వహించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై  నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు . సంగీతం పవన్ సి ఎచ్ అందించారు. 
 
కథ
రాజవరంలోని రంగబలి సెంటర్‌కు చెందిన శ్రీ శౌర్య అలియాస్ షో (నాగశౌర్య) ఎలాంటి ఫ్యామిలీ బాధ్యతలు లేకుండా ఫ్రెండ్స్‌ (సత్య)తో మందు కొడుతూ షికార్లు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేసే యువకుడు. కొడుకు ప్రయోజకుడై తాను నడిపే మెడికల్ షాపును చూసుకోవాలని తండ్రి తపన పడుతుంటాడు. అయితే అల్లరి చిల్లరిగా తిరుగుతున్న శౌర్యను తండ్రి వైజాగ్‌కు పంపిస్తాడు. అలా వైజాగ్‌కు వెళ్లిన శ్రీ శౌర్య మెడికల్ స్టూడెంట్ సహజ (యుక్తి తరేజా)తో ప్రేమలో పడుతాడు. అయితే తన కూతురిని పెళ్లి చేసుకోవాలంటే రంగబలి నుంచి వచ్చేసి వైజాగ్‌లో స్థిరపడాలని సహజ తండ్రి (మురళీ శర్మ) కండిషన్ పెడుతాడు. రంగబలి సెంటర్‌లో ఫ్రెండ్స్‌తో శౌర్య చేసే పనులేంటి? రంగబలి నుంచి శౌర్యను తండ్రి ఎందుకు వైజాగ్ పంపించాడు? వైజాగ్‌కు వెళ్లిన శౌర్య మెడికో సహజతో ఎలా ప్రేమలో పడ్డాడు? శౌర్యకు సహజ తండ్రి ఎలాంటి కండీషన్లు పెట్టాడు? రంగబలి సెంటర్ నుంచి శౌర్య రావడానికి ఎందుకు విముఖత చూపించాడు? రంగబలి సెంటర్ పేరును ఎందుకు మార్చాలని శౌర్య నిర్ణయం తీసుకొన్నాడు. స్థానిక ఎమ్మెల్యే పరుశురాం (చాకో)ను శౌర్య ఎలా ప్రతిఘటించాడు. రంగబలికి రంగారెడ్డి (శరత్ కుమార్)కు సంబంధం ఏమిటి? రంగబలి సెంటర్ అంటే సహజ తండ్రికి ఎందుకు అయిష్టం? చివరకు సహజ తండ్రి కండీషన్లకు శౌర్య తలవొగ్గాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానమే రంగబలి సినిమా 

రిలీజ్
ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 
ట్రైలర్
ట్రైలర్ చూస్తుంటే వినోదం, ప్రేమకథ, యాక్షన్, భావోద్వేగాలు మొదలైన వాటితో కూడిన ఫుల్ ప్యాకేజీ మూవీగా అనిపిస్తుంది. ముఖ్యంగా హీరో డిఫరెంట్ లుక్‌లో మాస్‌గా కనిపించాడు. కమెడియన్ సత్య పాత్ర హాస్యభరితంగా ఉండగా షైన్ టామ్ చాకో విరోధిగా కనిపించాడు. ట్రైలర్‌లో శరత్ కుమార్‌ని కూడా చూపించారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+