X
రంగబలి

రంగబలి

Comedy | Drama | 07 Jul 2023 | U | 130 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

రంగబలి స్టోరీ

రంగబలి మూవీ కామెడీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, యుక్తి తరేజా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పవన్ బసంశెట్టి వహించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై  నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు . సంగీతం పవన్ సి ఎచ్ అందించారు.    కథ రాజవరంలోని రంగబలి సెంటర్‌కు చెందిన శ్రీ శౌర్య అలియాస్ షో (నాగశౌర్య) ఎలాంటి ఫ్యామిలీ బాధ్యతలు లేకుండా ఫ్రెండ్స్‌ (సత్య)తో మందు కొడుతూ షికార్లు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేసే యువకుడు. కొడుకు ప్రయోజకుడై తాను నడిపే మెడికల్ షాపును చూసుకోవాలని తండ్రి తపన పడుతుంటాడు. అయితే అల్లరి చిల్లరిగా తిరుగుతున్న శౌర్యను తండ్రి వైజాగ్‌కు పంపిస్తాడు. అలా వైజాగ్‌కు వెళ్లిన శ్రీ శౌర్య మెడికల్ స్టూడెంట్ సహజ (యుక్తి తరేజా)తో ప్రేమలో పడుతాడు. అయితే తన కూతురిని పెళ్లి చేసుకోవాలంటే రంగబలి నుంచి వచ్చేసి వైజాగ్‌లో స్థిరపడాలని సహజ తండ్రి (మురళీ శర్మ) కండిషన్ పెడుతాడు. రంగబలి సెంటర్‌లో ఫ్రెండ్స్‌తో శౌర్య చేసే పనులేంటి? రంగబలి నుంచి శౌర్యను తండ్రి ఎందుకు వైజాగ్ పంపించాడు? వైజాగ్‌కు వెళ్లిన శౌర్య మెడికో సహజతో ఎలా ప్రేమలో పడ్డాడు? శౌర్యకు సహజ తండ్రి ఎలాంటి కండీషన్లు పెట్టాడు? రంగబలి సెంటర్ నుంచి శౌర్య రావడానికి ఎందుకు విముఖత చూపించాడు? రంగబలి సెంటర్ పేరును ఎందుకు మార్చాలని శౌర్య నిర్ణయం తీసుకొన్నాడు. స్థానిక ఎమ్మెల్యే పరుశురాం (చాకో)ను శౌర్య ఎలా ప్రతిఘటించాడు. రంగబలికి రంగారెడ్డి (శరత్ కుమార్)కు సంబంధం ఏమిటి? రంగబలి సెంటర్ అంటే సహజ తండ్రికి ఎందుకు అయిష్టం? చివరకు సహజ తండ్రి కండీషన్లకు శౌర్య తలవొగ్గాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానమే రంగబలి సినిమా  రిలీజ్ ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.    ట్రైలర్ ట్రైలర్ చూస్తుంటే వినోదం, ప్రేమకథ, యాక్షన్, భావోద్వేగాలు మొదలైన వాటితో కూడిన ఫుల్ ప్యాకేజీ మూవీగా అనిపిస్తుంది. ముఖ్యంగా హీరో డిఫరెంట్ లుక్‌లో మాస్‌గా కనిపించాడు. కమెడియన్ సత్య పాత్ర హాస్యభరితంగా ఉండగా షైన్ టామ్ చాకో విరోధిగా కనిపించాడు. ట్రైలర్‌లో శరత్ కుమార్‌ని కూడా చూపించారు. 
Read More

రంగబలి కాస్ట్ & క్రూ

రంగబలి సిబ్బంది సమాచారం

దర్శకత్వం పవన్ బసంశెట్టి
స్టోరీ పవన్ బసంశెట్టి
సినిమాటోగ్రఫీ దివాకర్ మణి
సంపాదకుడు కార్తీక శ్రీనివాస్
సంగీతం పవన్ సి ఎచ్
నిర్మాత సుధాకర్ చెరుకూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రంగబలి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, యాక్షన్, కామెడీ, సొంతఊరు అనే ఎమోషన్‌తో రూపొందిన చిత్రం రంగబలి. సత్య కామెడీ ఈ సినిమాకు అత్యంత పాజిటివ్ అంశం. నాగశౌర్య ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ కొత్తగా ఉంటాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. కథపై ఇంకాస్త బెటర్ ఎమోషనల్ డ్రామాగా మారి ఉండేదనిపిస్తుంది. రెండున్నర గంటల సేపు హాయిగా నవ్వుకోవాలనుకొంటే.. రంగబలిని చూడొచ్చు. హాస్యంతో మంచి అనుభూతి కలిగిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి ఫన్‌తో సినిమాను ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి.

రంగబలి ట్రైలర్

Video Thumbnail

రంగబలి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

రంగబలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+