రంగస్థలం సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, ఆది పినిశెట్టి, పూజా హెగ్దే, ప్రకాష్ రాజ్, అనసూయ భరద్వాజ, బ్రహ్మాజి, జబర్దస్థ్ మహేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్ వహిచారు మరియు మైత్రి మూవీ మేకర్స్ సమస్థలో నవీన్ యెర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.
కథ
చెవిటివాడైన చిట్టిబాబు (రాంచరణ్) రంగస్థలం గ్రామవాసి. పొలానికి నీటి సౌకర్యాన్ని అందించే పంపుసెట్ల ఇంజినీర్. చిట్టిబాబుకు కుమార్ అనే అన్నయ (ఆది పినిశెట్టి), తల్లి, తండ్రి (నరేష్), ఓ చెల్లలు ఉంటుంది. చిట్టిబాబు అన్యాయాన్ని అసలే సహించడు. రామలక్ష్మీ (సమంత)తో ప్రేమలో పడుతాడు. గ్రామంలో ప్రెసిడెంట్ (జగపతిబాబు) చేసే అన్యాయాలను ఎదురించడానికి అన్నదమ్ములు సిద్ధమవుతారు. గ్రామాభివృద్ధి కోసం ప్రసిడెంట్‌గా పోటీ చేయాలని కుమార్ ఎన్నికల బరిలోకి దిగుతాడు. కుమార్‌కు అండగా నవభారత్ పార్టీ ఎమ్మెల్యే (ప్రకాశ్ రాజ్) అండగా నిలుస్తాడు. ఎన్నికల బరిలోకి దిగిన కుమార్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఎన్నికల బరిలోకి దిగిన తన అన్నయ్యకు చిట్టిబాబు ఏ విధంగా తోడ్పాటునందించాడు? ప్రేమించిన రామలక్ష్మీని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎన్నికల్లో కుమార్ గెలిచాడా? ప్రసిడెంట్ పరిస్థితి ఏమైంది? రంగస్థలంలో ప్రసిడెంట్ దురాగతాలను ఎలా చరమగీతం పాడారు అనే ప్రశ్నలకు సమాధానమే రంగస్థలం సినిమా కథ.