రంగ్ దే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చితం ఇందులో నితిన్, కీర్తి సురేష్, నరేష్, రోహిణి, కౌసల్య, రోనిత్ కమ్ర, సుహాస్, అభినవ్, గాయత్రి రఘురామ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకీ అట్లూరి వహించారు. పీడీవీ ప్రసాద్, సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు.
కథ
అర్జున్ (నితిన్), అనుపమ (కీర్తి సురేష్) చిన్ననాటి స్నేహితులు. పక్క పక్క ఇంట్లో ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్. చదువుల్లో అర్జున్ అంతంత మాత్రంగా ఉంటే.. అనుపమ ఎప్పుడూ టాప్ స్కోరర్‌గా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిద్దరి మధ్య స్నేహం, ప్రేమతోపాటు ద్వేషం కూడా కొనసాగుతుంటుంది. అయితే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకొన్న అనుపమ కోరికకు తల్లి (రోహిణి) అడ్డుపడి పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంది. అర్జున్ మీద ప్రేమను చంపుకోలేక.. ఇష్టం లేని వివాహం చేసుకోలేక పెళ్లి పీటల మీద నుంచి లేచి రావడం స్నేహితుడిని పెళ్లాడటం చకచకా జరిగిపోతాయి. తన ప్రమేయం లేకుండా పెళ్లి జరిగిన క్రమంలో అసంతృప్తితో ఉన్న అర్జున్, అనుపమ ఉన్నత విద్య కోసం దుబాయ్‌కి వెళ్తారు. దుబాయ్‌కి వెళ్లిన అర్జున్, అనుపమ మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి. దుబాయ్‌లో వారి కాపురం ఎలా సాగింది? ఎలాంటి పరిస్థితుల్లో అనుపమ ప్రెగ్నెంట్ అవుతుంది? ప్రెగ్నెంట్ తర్వాత అర్జున్‌కు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకొంటుంది? విడాకులకు సిద్ధమైన అనుపమతో రాజీ చేయడానికి అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు? అప్పటి వరకు ఓ రకమైన ఫీలింగ్‌లో ఉన్న అర్జున్‌లో అనుపమపై ఎందుకు సడెన్‌గా కొండంత ప్రేమ కలిగింది అనే ప్రశ్నలకు సమాధానమే రంగ్ దే.