twitter

    రిపబ్లిక్ స్టోరి

    రిపబ్లిక్ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, ఐశ్యర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దేవా కట్ట వహించారు. పుల్ల రావ్, జె భగవాన్ కలిసి నిర్మించారు. సంగీతం మణి శర్మ అందించారు. 

    కథ
    పంజా అభిరామ్ ( సాయిధరమ్ తేజ్) చిన్నతనం నుంచే అవినీతి, అక్రమాలంటే సహించడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి (జగపతిబాబు) చేసే అవినీతిని ప్రశ్నిస్తుంటాడు? అలా పెరిగిన అభిరామ్ అమెరికాలోని ఎంఐటీలో సీటు సంపాదిస్తాడు. కానీ ఏలూరులోని కొన్ని ప్రాంతాల్లోని పరిస్థితుల కారణంగా అమెరికాకు వెళ్లే ఆలోచనను మానుకొని ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. అదే జిల్లాకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలను చేపడుతాడు? తన జిల్లాకు శాపంగా మారిన తెల్లేరు (కొల్లేరును పేరు మార్చి) సరస్సులో చేపల పెంపకం, అక్కడ ముఖ్యమంత్రి విశాఖ వాణి (రమ్యకృష్ణ) సాగించే అక్రమాలకు చరమగీతం పాడేందుకు సిద్ధమవుతాడు. ప్రత్యేక అధికారంతో ఐఏఎస్‌గా రిక్రూట్ అయిన అభిరామ్‌కు ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి? తెల్లేరు అక్రమాలపై గ్రామస్థులను చైతన్యం చేయడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తన తండ్రి చేసిన అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అభిరామ్ తండ్రి (జగపతిబాబు) ఎందుకు అవినీతి అధికారిగా మారాడు? విశాఖవాణి అవినీతి, అక్రమాలకు ఎందుకు పాల్పడింది? చివరకు ఐఏఎస్ అభిరామ్ అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే రిపబ్లిక్ సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie రిపబ్లిక్ with us? Please send it to us ([email protected]).
    • Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
    Go to : Republic Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X