X
తెలుగు » సినిమాలు » రిపబ్లిక్
రిపబ్లిక్

రిపబ్లిక్

Action | Drama | 01 Oct 2021 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

రిపబ్లిక్ స్టోరీ

రిపబ్లిక్ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, ఐశ్యర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దేవా కట్ట వహించారు. పుల్ల రావ్, జె భగవాన్ కలిసి నిర్మించారు. సంగీతం మణి శర్మ అందించారు.  కథ పంజా అభిరామ్ ( సాయిధరమ్ తేజ్) చిన్నతనం నుంచే అవినీతి, అక్రమాలంటే సహించడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి (జగపతిబాబు) చేసే అవినీతిని ప్రశ్నిస్తుంటాడు? అలా పెరిగిన అభిరామ్ అమెరికాలోని ఎంఐటీలో సీటు సంపాదిస్తాడు. కానీ ఏలూరులోని కొన్ని ప్రాంతాల్లోని పరిస్థితుల కారణంగా అమెరికాకు వెళ్లే ఆలోచనను మానుకొని ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. అదే జిల్లాకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలను చేపడుతాడు? తన జిల్లాకు శాపంగా మారిన తెల్లేరు (కొల్లేరును పేరు మార్చి) సరస్సులో చేపల పెంపకం, అక్కడ ముఖ్యమంత్రి విశాఖ వాణి (రమ్యకృష్ణ) సాగించే అక్రమాలకు చరమగీతం పాడేందుకు సిద్ధమవుతాడు. ప్రత్యేక అధికారంతో ఐఏఎస్‌గా రిక్రూట్ అయిన అభిరామ్‌కు ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి? తెల్లేరు అక్రమాలపై గ్రామస్థులను చైతన్యం చేయడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తన తండ్రి చేసిన అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అభిరామ్ తండ్రి (జగపతిబాబు) ఎందుకు అవినీతి అధికారిగా మారాడు? విశాఖవాణి అవినీతి, అక్రమాలకు ఎందుకు పాల్పడింది? చివరకు ఐఏఎస్ అభిరామ్ అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే రిపబ్లిక్ సినిమా కథ.
Read More

రిపబ్లిక్ కాస్ట్ & క్రూ

రిపబ్లిక్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం దేవా కట్టా
సినిమాటోగ్రఫీ ఎమ్ సుకుమార్
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత పుల్లరావు, జె భగవాన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రిపబ్లిక్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
దర్శకుడు దేవ కట్టా ఎంచుకొన్న ఓ ప్రాంతానికి ప్రాణ నాడిగా మారిన ఓ సరస్సును కలుషితం చేస్తూ రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమ వ్యాపారం అనే పాయింట్‌కు ప్రస్తుత పరిస్థితులను జోడించి చెప్పిన విధానం బాగుంది. రాజకీయ వ్యవస్థ నుంచి బ్యూరోక్రాట్స్‌ను వేరు చేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చనే కోణంలో రిపబ్లిక్‌ను తీర్చి దిద్దిన విధానం బాగుంది. పరిణామాలు, పరిమాణం లాంటి పర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకొంటాయి. కాకపోతే సగటు ప్రేక్షకుడిని పట్టించుకోకుండా కమర్షియల్ అంశాలకు దూరంగా సినిమాను కొంత ఏదో అసంతృప్తి కలుగుతుంది. అయితే సాధారణ ప్రేక్షకుడికి కాస్త తికమక కలిగించే పదజాలం, భారమైన డైలాగ్స్‌ను మరికొంత సున్నితంగా చెప్పి ఉంటే బాగుండేదనిపించింది. అలాగే కొన్ని పాత్రలను బలంగా రాసుకొంటే.. విశాఖవాణి పాత్రలో ఏటు తేల్చుకోలేని ఊగిసలాట కనిపిస్తుంది. మిగితా విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా తన పంథాను పక్కాగా చెప్పడంలో సక్సెస్ అయ్యారు.

రిపబ్లిక్ ట్రైలర్

Video Thumbnail

రిపబ్లిక్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రిపబ్లిక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+