రౌడీ బాయ్స్ (2022)(U/A)
Release date
14 Jan 2022
genre
రౌడీ బాయ్స్ స్టోరి
రౌడీ బాయ్స్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆశిష్, అనుపమ పరమేశ్వరన్, సాహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హర్ష కొనుగంటి వహించారు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.
కథ
అక్షయ్( ఆశిష్) ఎలాంటి బాధ్యత లేకుండా అల్లరిగా తిరిగే కుర్రాడు. జీవితంలో ఏం చేయాలి అనే క్లారిటీ లేని అక్షయ్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. మరోపక్క కావ్య(అనుపమా పరమేశ్వరన్) మెడికల్ స్టూడెంట్. బీటెక్ లో చేడానికి వెళ్తూ.. కావ్యను చూస్తాడు అక్షయ్.. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే అక్షయ్ జాయిన్ అయిన కాలేజీ విద్యార్థులకు కావ్య చదువుతున్న కాలేజీ విద్యార్థులకు అస్సలు పడదు. ఈ రెండు కాలేజీలో విద్యార్థుల మధ్యగ్యాంగ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. మరో వైపు కావ్యను అక్షయ్ తో పాటు.. తన క్లాస్ మెట్ విక్రమ్ (విక్రమ్ సహదేవ్)కూడా ప్రేమిస్తుంటాడు. అయితే ఈ ఇద్దరిలో కావ్య ప్రేమని ఎవరు పొందారు? ఈ ప్రేమను పొందే క్రమంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేదే అసలు సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie రౌడీ బాయ్స్ with us? Please send it to us ([email protected]).