రుద్రంగి సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులు నటించారు. అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. నిర్మాత రసమయి బాలకృష్ణ నిర్మించారు.
రిలీజ్
జులై 7 న సినిమా విడుదలవనుందని చిత్రబృందం ప్రకటించింది.
స్టోరీ లైన్
ఒకప్పటి తెలంగాణ సామాజిక పరిస్థితులను నేపథ్యంగా ఎంచుకుని పీరియాడిక్ మూవీగా 'రుద్రంగి' రూపొందింది. నాటి తెలంగాణాలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు.