శాకిని డాకిని సినిమా కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నివేత థామస్, రెజినా కాసాండ్రా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుదీర్ వర్మ వహించారు. నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం మీకీ ఎమ్ సి క్లీరీ అందించారు. మీకీ ఎమ్ సి క్లీరీ అందించారు.
కథ
షాలిని అలియాస్ శాకిని ( నివేదా థామస్), దామిని అలియా డాకిని ( రెజీనా కసండ్రా) పోలీసు ఉద్యోగం అంటే చెప్పలేనంత ఇష్టం. పోటీ పరీక్షలో విజయం సాధించి పోలీస్ అకాడమీలో ట్రైనింగ్‌లో చేరుతారు. హాలీడే సందర్భంగా బయటకు వచ్చిన ఈ ఇద్దరికి కిడ్నాప్ సంఘటన ఎదురు పడుతుంది. ఆ సమయంలో అమ్మాయిలను కిడ్నాప్ చేసి మెడికల్ మాఫియా చేస్తున్న దారుణాలను ప్రత్యక్షంగా చూస్తారు. ఓ దశలో కిడ్నాప్ గురైన షాలిని, దామిని మెడికల్ మాఫియాపై పోరాటం సాగిస్తారు. కిడ్నాప్ గురవుతున్న అమ్మాయిలపై ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు? షాలిని, దామిని మెడికల్ మాఫియాను ఎలా ఎదురించారు? చివరికి పోలీసు విభాగం అనుమతి లేకుండా మెడికల్ మాఫియా ఆటకట్టించడం వల్ల షాలిని, దామినిక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు షాలిని, దామినికి పోలీసులు నుంచి ఎలాంటి అనుభవం ఎదురైందనే ప్రశ్నలకు సమాధానమే షాకిని డాకిని సినిమా కథ.