సదా నన్ను నడిపే సినిమా రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్, వైష్ణవి పట్వర్ధన్, నాగేంద్రబాబు, డిఆర్. శేఖర్, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ, మహేష్ అచంట, సుదర్శన్, నవీన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం: లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్ వహించారు.
కథ
స్నేహితులతో సరదాగా జీవితాన్ని ఆస్వాదించే MJ అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సాహా (వైష్ణవి పట్వర్ధన్)తో ప్రేమలో పడుతాడు. సాహా తండ్రి (రాజీవ్ కనకాల) ఎంజే ప్రేమను రిజెక్ట్ చేసినా వెంటపడి సిన్సియర్‌గా ప్రేమిస్తాడు. చివరకు మైఖేల్ జాక్సన్ ప్రేమను అంగీకరించి.. సాహా పెళ్లి చేసుకొంటుంది. అయితే పెళ్లి తర్వాత భర్తను సాహా దూరంగా పెడుతుంది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన భర్తను సాహా ఎందుకు దూరం పెట్టింది? భర్తకు సాహా దూరంగా ఉండాలని అనుకోవడం వెనుక కారణం ఏమిటి? సాహ తనను దూరం పెట్టడంతో ఎంజే ఏం చేశాడు? తమ దాంపత్య జీవితంలో ఏర్పడిన సమస్యను సాహా, ఎంజే ఎలా పరిష్కరించుకొన్నారు. చివరికి సాహా, ఎంజే బంధానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే సదా నన్ను నడిపే సినిమా కథ.