సంక్రాంతి సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, శ్రీకాంత్, శర్వనంద్, శివాజి రాజా, స్నేహ ప్రసన్న, సంగీత, శారదా, చంద్ర మోహన్, సుధాకర్, ఆర్తి అగర్వల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ముప్పలనేని శివ నిర్వహించారు మరియు నిర్మాతలు ఆర్ బి చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకుర్చారు.
కథ
మంచి కుటుంబ విలువలు తేలియజేసే సినిమా ఇది..అలాంటి కుటుంబంలో రాఘవేంద్ర (వెంకటేష్), విష్ణు (శ్రీకాంత్), చిన్నా (శివ బాలాజి) మరియు వంశి (శర్వనంద్) నలుగురు అన్నదమ్ములు. రాఘవేంద్ర పద్మ (ఆర్తి అగర్వల్) ప్రేమించు కుంటారు...అందులోనే బందువులు కూడ అవుతారు..ఇంకేముంది పెద్దలు వాళ్ళకి పెళ్ళి చేయడానికి సిద్దమవుతారు..కాని అనుకోకుండా రాఘవేంద్ర కుటుంబం అన్ని ఆస్థులు పోగోట్టుకుంటారు. అప్పుడు పద్మ వాళ్ళ నాన్న పెళ్ళిని ఆపేస్తాడు. ఆ సంఘటన తర్వత రాఘవేంద్ర బాగా సంపాదించి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు..అలాగే కష్టపడి తన కుటుంబం సహయంతో సంపాదిస్తాడు. అప్పుడు అంజలి (స్నేహ) ని రాఘవేంద్ర పెళ్ళిచేసుకుంటాడు..అలాగే పద్మజ చేలేలు కళ్యాని (సంగీతని) విష్ణు పెళ్ళి చేసుకుంటాడు. రాఘవేంద్ర ఇంటి పెద్దగా అలాగే బాజ్యత గల మనిషి గా తన కుటుంబంలో వచ్చే సమస్యలను అందరికి నచ్చేవిదంగా ఎలా పరిష్కరిస్తాడు అనేది మిగతా కథా