సర్కార్ స్టోరి

    సర్కార్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి, యోగి బాబు, రాధా రవి, లివింగ్ స్టన్, తులసి శివమణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఆర్ మురుగదాస్ వహించరు మరియు నిర్మాత కాళానిధి మారన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎ ఆర్ రెహమాన్ అందించారు.

    కథ

    సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జీఎల్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీఈవోగా సేవలందిస్తుంటారు. ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సుందర్ అంటే దడ. ప్రతీ దేశంలోని ప్రత్యర్థి కంపెనీలపై దాడులు చేసే ఛంఘీజ్ ఖాన్ అనే పేరు మూటగట్టుకొంటాడు. ఇలాంటి ఇమేజ్ ఉన్న సుందర్ ఇండియాకు వస్తుంటే అందరూ గజగజలాడిపోతాడు. కానీ అతడు స్వదేశానికి ఓటు వేయడానికి వచ్చాడని తెలుసుకొని ఊరట చెందుతారు. కానీ ఓటు వేయడానికి వచ్చిన సుందర్‌కు ఓ షాక్ తగులుతుంది. అప్పటికే సుందర్ ఓటు మరోకరు వేయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. తన ఓటును మరో వ్యక్తి వేసిన క్రమంలో సుందర్ ఏం చేశాడు? తన ఓటు హక్కును ఎలా సాధించుకోగలిగాడు? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడానికి సుందర్ ఏం చేశాడు. సుందర్ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎమ్మెల్యే కూతురైన లీలా (కీర్తీ సురేష్‌)కు సుందర్‌కు లింక్ ఏమిటీ? విదేశాల్లో ఉండే కోమలివల్లి (వరలక్ష్మీ శరత్ కుమార్) రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? కోమలివల్లికి సుందర్‌కు మధ్య వైరం ఎందుకు కలిగింది? రాజకీయాల్లో సుందర్ తన లక్ష్యాన్ని ఛేదించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే సర్కార్ సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie సర్కార్ with us? Please send it to us (popcorn@oneindia.co.in).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X