X
తెలుగు » సినిమాలు » సర్కార్
సర్కార్

సర్కార్

Action | Romance | 06 Nov 2018 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సర్కార్ స్టోరీ

సర్కార్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి, యోగి బాబు, రాధా రవి, లివింగ్ స్టన్, తులసి శివమణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఆర్ మురుగదాస్ వహించరు మరియు నిర్మాత కాళానిధి మారన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎ ఆర్ రెహమాన్ అందించారు. కథ సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జీఎల్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీఈవోగా సేవలందిస్తుంటారు. ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సుందర్ అంటే దడ. ప్రతీ దేశంలోని ప్రత్యర్థి కంపెనీలపై దాడులు చేసే ఛంఘీజ్ ఖాన్ అనే పేరు మూటగట్టుకొంటాడు. ఇలాంటి ఇమేజ్ ఉన్న సుందర్ ఇండియాకు వస్తుంటే అందరూ గజగజలాడిపోతాడు. కానీ అతడు స్వదేశానికి ఓటు వేయడానికి వచ్చాడని తెలుసుకొని ఊరట చెందుతారు. కానీ ఓటు వేయడానికి వచ్చిన సుందర్‌కు ఓ షాక్ తగులుతుంది. అప్పటికే సుందర్ ఓటు మరోకరు వేయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. తన ఓటును మరో వ్యక్తి వేసిన క్రమంలో సుందర్ ఏం చేశాడు? తన ఓటు హక్కును ఎలా సాధించుకోగలిగాడు? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడానికి సుందర్ ఏం చేశాడు. సుందర్ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎమ్మెల్యే కూతురైన లీలా (కీర్తీ సురేష్‌)కు సుందర్‌కు లింక్ ఏమిటీ? విదేశాల్లో ఉండే కోమలివల్లి (వరలక్ష్మీ శరత్ కుమార్) రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? కోమలివల్లికి సుందర్‌కు మధ్య వైరం ఎందుకు కలిగింది? రాజకీయాల్లో సుందర్ తన లక్ష్యాన్ని ఛేదించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే సర్కార్ సినిమా కథ.
Read More

సర్కార్ కాస్ట్ & క్రూ

సర్కార్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎ ఆర్ మురుగదాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత కళానిధి మారన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సర్కార్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
దేశ పురోగతిని నిర్దేశించే ఓటు విలువ ప్రాధాన్యాన్ని చెప్పే కథాంశంతో సర్కార్ సినిమా రూపుదిద్దుకొన్నది. పాయింట్ బాగా ఉన్నప్పటికీ.. కథ, కథనాలు పేలవంగా ఉండటం సినిమాకు ప్రతికూలంగా మారింది. విజయ్ ఫ్యాన్స్‌, రాజకీయ నేపథ్యమున్న చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఆదరించడం బట్టే తెలుగులో విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి.

సర్కార్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సర్కార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+