సవారి సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందు, ప్రియాంక, శ్రీకాంత్ రెడ్డి గంటా, మ్యాడీ, శివ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాహిత్ మోత్‌కూరి వహించారు. సంతోష్ మోత్‌కూరి, నిషాంక్ రెడ్డి కలిసి నిర్మించారు. సంగీతం శేఖర్ చంద్ర అందించారు. ఛాయాగ్రహణం: మోనిశ్ భూపతిరాజు.
కథ
“బంధం రేగడ్” అనే షార్ట్ ఫిలిం తో 2018లో ప్రతిష్టాత్మక “సైమా” బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు అందుకున్న సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన సవారి చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాలో నందు హీరోగా నటించాడు ప్రియాంక శర్మ హీరయిన్ గా నటించింది ఈ చిత్ర కదా కధనం లోకి వెళ్తే రాజు (నందు) స్లమ్ ఏరియాలో ఉంటూ గుర్రాన్ని నడుపుకునే దిగువు తరగతి పర్సన్. తన వంశపారంపర్యంగా వచ్చే సవారి వృత్తిని చేసుకుంటూ తన జీవనం సాగిస్తుంటాడు. తాను ఎంతగానో ప్రేమించే గుర్రం పేరు బాద్షా అతిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భాగీ (ప్రియాంక శర్మ) అయితే బాద్షా మిస్సవటం దానికి గల కారణాలను ఎలా తెలుసుకున్నాడు అసలు దానికి కారకులు ఎవరనేది తెరపై చూడాల్సిందే