X
Home టాప్ లిస్టింగ్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నుంచి 100 కోట్లు సాదించ గలిగే సత్తా వున్నా రాబోయే మూవీస్

Author Administrator | Updated: Saturday, April 22, 2023, 01:58 PM [IST]

ఈ ఏడాది తెలుగు లో ఇప్పటికే 100 కోట్లు సాధించిన మూవీస్ ని మనం చూసాం. మన టాప్ డైరెక్టర్స్ మన ముందుకు మూవీస్ తేవటానికి ఎంతో కష్టపడుతున్నారు. టాప్ డైరెక్టర్స్ సినిమాలు అంటే మాములుగా వుండవు, బడ్జెట్ విషయం లో ఎక్కడ తగ్గకుండ నిర్మతలు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కపుడు 100 కోట్లు సాధించే సినిమాలు ఏడాది కి ఒక్కటో రెండో వచ్చేవి కానీ ప్రస్తుతం టాప్ డైరెకర్స్ నుంచి వచ్చే ప్రతి సినిమా 100 కోట్లు సాదించ గలిగే సత్తా ఉందనే చెప్పాలి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ 100 కోట్లు సాదించ గలిగే సత్తా వున్నా మూవీస్ లిస్ట్ మీ కోసం


cover image
SSMB 28
1

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ మొదట్లో అతడు అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్దగా లాభాలు అందించకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత టెలివిజన్లో మాత్రం భారీ స్థాయిలో టిఆర్పిని అందుకుంది. ఇప్పటికీ కూడా ఆ సినిమా ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక తర్వాత వచ్చిన ఖలేజా సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా మహేష్ బాబును త్రివిక్రమ్ సరికొత్తగా ప్రజెంట్ చేయడం ఫాన్స్ కు చాలా నచ్చింది.  ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఇదివరకే చాలా రకాల కథనాలు వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాబ్ ప్రకారమైతే సినిమా టోటల్ బడ్జెట్ 200 కోట్ల వరకు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదటినుంచి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వర్క్ చేస్తున్న హారిక హాసిని సంస్థ ఇంతవరకు ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ఖర్చు చేసింది లేదు. కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో కాబట్టి ఖర్చుకు ఏమాత్రం వెనకాడడం లేదట

పుష్ప 2
2

పుష్ప ద రైజ్‌ మూవీ బాక్సాఫీస్‌ను దున్నేసింది. ఈ పాన్‌ ఇండియా మూవీ తెలుగులోనే కాదు హిందీ, మలయాళం భాషల్లోనూ భారీ వసూళ్లు సాధించింది. అయితే తొలి పార్ట్‌ సక్సెస్‌ కావడంతో సెకండ్‌ పార్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 మూవీ అంచనాలు అందుకోవాలంటే దీనిని భారీ బడ్జెట్‌తో నిర్మించడం ఒక్కటే మార్గమని మేకర్స్‌ భావిస్తున్నారు.

ఏజెంట్
3

అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా  ఏజెంట్ ఏప్రిల్​లో విడుదల కానుంది. భారీ హంగులతో తెరకెక్కినది. సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా  'ఏజెంట్' సినిమా స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌  రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్​లో మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర లో నటించారు. నిర్మాత అనిల్ సుంక‌ర‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే సురేంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా మారబోతున్నారు. ఈ సినిమా  ఏప్రిల్​ 28న రిలీజ్ కాబోతుంది.

దసరా
4

నాచురల్ స్టార్ అని కరియర్లో భారీ బడ్జెట్ సినిమాగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా  దసరా. శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.  భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చ్ 30న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే బడ్జెట్ చాలా వరకు తిరిగి వచ్చేసిందని నిజానికి బడ్జెట్ కంటే ఎక్కువే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. అన్ని హక్కులు కలుపుకొని సినిమా 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

హరి హర వీర మల్లు
5

హరి హర వీర మల్లు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. వరుస సినిమాలను లైన్లో పెడుతూ స్పీడ్ పెంచేస్తున్నాడు.ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ సినిమా ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం అందులోను భారీ పీడియాడిక్ సినిమా కావడం వల్ల సెట్స్ కోసం, గ్రాఫిక్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టారు. ఈ సినిమా కూడా  100 కోట్లు సాదించ గలిగే సత్తా వున్నా మూవీస్ లిస్ట్ ఒక్కటి 

అనిల్ రావిపూడి
6

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా NBK 108. వీర సింహ రెడ్డి సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా వస్తుడటంపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ సినిమాలు అంటేనే ఎదో కొత్త గా ఉన్నటుంది. ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో వుంటాయో ఇంకా చెప్పాల్సిన పనిలేదు 

రామ్ చరణ్ 15
7

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో రావడంతో పాటు దిల్ రాజు  నిర్మాణంలో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ డిమాండ్ పలుకుతున్నట్టు తెలుస్తుంది. 

ఉస్తాద్ భగత్ సింగ్
8

గబ్బర్‌సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీని అందించిన దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తోంది. హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ తమిళ సినిమా తేరి రీమేక్‌. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+