సీమ టపాకాయ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, పూర్ణ, బ్రహ్మానందం, సాయాజీ షిండే, అలీ, వేణుమాధవ్, రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, జయప్రకాష్ రెడ్డి, గీతాసింగ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి నాగేశ్వరరెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత మళ్ళి విజయ్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకుర్చారు.
కథ
కృష్ణ (నరేష్) పెద్ద కోటీశ్వరుడు (సాయాజీషిండే) గారాల కొడుకు. అతని తండ్రికి కామన్ గానే కనీసం పది వేల కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయిని కోడలిగా తమ ఇంటికి తెచ్చుకోవాలనుకుంటాడు. అయితే కృష్ణ తొలి చూపులోనే సత్య (పూర్ణ) తో ప్రేమలో పడిపోతాడు. పడిందే తడువుగా ఆమె వెనక పడగా..పడగా అతనికో భయంకర నిజం తెలుస్తుంది. అది...సత్యకు ధనవంతులంటే అస్సలు పడదు. కోటిశ్వరులంతా డబ్బు ని పేదలకు పంచి పెట్టాలని, పేదలు కోసం పాటు పడాలని ఆమెకు తోచిన లాజిక్ లతో చెప్తూ తిరుగుతూంటుంది. దాంతో తాను కోటీశ్వరుడుని అని తెలిస్తే ఏ సమస్య వస్తుందో అని ఆమె మనస్సు గెలవటానికి ఓ ఎత్తు వేస్తాడు. కృష్ణ తన పేరు పేద కృష్ణ అని అబద్దమాడి ..ఆమెతో పరిచయం పెంచుకొంటాడు.పేదవాడికే తన మనస్సు నివ్వాలని డిసైడ్ అయ్యిన ఆమె వెంటనే కృష్ణకు తన మనస్సుని ఇచ్చేస్తుంది. ఇలా మనస్సుల మార్చుకునే కార్యక్రమం అయ్యాక దండలు మార్చుకునే కార్యక్రమం ఉంది కాబట్టి ఆమె నీ కుటుంబాన్ని పరిచయం చేయి అని అంటుంది. తప్పని సరి పరిస్ధితుల్లో కృష్ణ తన రిచ్ ఫ్యామిలీని కూటికి కూడా గతిలేని పేద కుటుంబంగా ఆమెకు పరిచయం చేయాలని నిర్ణయించుకుని తన వాళ్ళను బ్రతిమాలి..పేదవాళ్ళుగా నటింపచేయటానకి ఒప్పిస్తాడు. వారంతా నాటకమాడి ఆమెని పెళ్ళికి ఒప్పించి ఓకే అనుకున్న సమయంలో ఈ సారి సత్య ఫ్యామిలీ గురించి మరో ఊహించని నిజం రివిలవుతుంది. ఇంతకీ ఏమిటా నిజం..దాంతో కథ ఏమి మలుపు తిరిగిందనేది మిగతా కథ.