X
తెలుగు » సినిమాలు » సీమ టపాకాయ
సీమ టపాకాయ

సీమ టపాకాయ

Comedy | Romance | 13 May 2011 | U/A |
Telugu

2.7 /5 Users

2 /5 Filmibeat

సీమ టపాకాయ స్టోరీ

సీమ టపాకాయ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్‌, పూర్ణ , బ్రహ్మానందం, సాయాజీ షిండే, అలీ, వేణుమాధవ్‌, రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్‌, జయప్రకాష్‌ రెడ్డి, గీతాసింగ్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి నాగేశ్వరరెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత మళ్ళి విజయ్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకుర్చారు. కథ కృష్ణ (నరేష్‌) పెద్ద కోటీశ్వరుడు (సాయాజీషిండే) గారాల కొడుకు. అతని తండ్రికి కామన్ గానే కనీసం పది వేల కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయిని కోడలిగా తమ ఇంటికి తెచ్చుకోవాలనుకుంటాడు. అయితే కృష్ణ తొలి చూపులోనే సత్య (పూర్ణ) తో ప్రేమలో పడిపోతాడు. పడిందే తడువుగా ఆమె వెనక పడగా..పడగా అతనికో భయంకర నిజం తెలుస్తుంది. అది...సత్యకు ధనవంతులంటే అస్సలు పడదు. కోటిశ్వరులంతా డబ్బు ని పేదలకు పంచి పెట్టాలని, పేదలు కోసం పాటు పడాలని ఆమెకు తోచిన లాజిక్ లతో చెప్తూ తిరుగుతూంటుంది. దాంతో తాను కోటీశ్వరుడుని అని తెలిస్తే ఏ సమస్య వస్తుందో అని ఆమె మనస్సు గెలవటానికి ఓ ఎత్తు వేస్తాడు. కృష్ణ తన పేరు పేద కృష్ణ అని అబద్దమాడి ..ఆమెతో పరిచయం పెంచుకొంటాడు.పేదవాడికే తన మనస్సు నివ్వాలని డిసైడ్ అయ్యిన ఆమె వెంటనే కృష్ణకు తన మనస్సుని ఇచ్చేస్తుంది. ఇలా మనస్సుల మార్చుకునే కార్యక్రమం అయ్యాక దండలు మార్చుకునే కార్యక్రమం ఉంది కాబట్టి ఆమె నీ కుటుంబాన్ని పరిచయం చేయి అని అంటుంది. తప్పని సరి పరిస్ధితుల్లో కృష్ణ తన రిచ్ ఫ్యామిలీని కూటికి కూడా గతిలేని పేద కుటుంబంగా ఆమెకు పరిచయం చేయాలని నిర్ణయించుకుని తన వాళ్ళను బ్రతిమాలి..పేదవాళ్ళుగా నటింపచేయటానకి ఒప్పిస్తాడు. వారంతా నాటకమాడి ఆమెని పెళ్ళికి ఒప్పించి ఓకే అనుకున్న సమయంలో ఈ సారి సత్య ఫ్యామిలీ గురించి మరో ఊహించని నిజం రివిలవుతుంది. ఇంతకీ ఏమిటా నిజం..దాంతో కథ ఏమి మలుపు తిరిగిందనేది మిగతా కథ.
Read More

సీమ టపాకాయ కాస్ట్ & క్రూ

సీమ టపాకాయ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జి. నాగేస్వర రెడ్ది
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాత డా మళ్ళ విజయ్ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సీమ టపాకాయ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
'కామిడి సినిమాలన్నిటిలో అల్లరి నరేష్ హీరో ఎలా అవడో...అల్లరి నరేష్ హీరోగా చేసే సినిమాలు అన్ని కామిడీగా అవ్వవు' అనే అద్బుతమైన సత్యాన్నితెలుగు ప్రేక్షకులకు తెలపటానికి తీసినట్లున్న ఈ చిత్రం ఓపినింగ్స్ వరకూ మంచి క్రేజ్ తెచ్చుకోగలిగింది. పాయింటుగా వినటానకి బాగానే అనిపించే ఈ చిత్రంలో సీమ ప్యాక్షన్ సంభంధం లేకుండా దూరిపోయి కథను కకావికలు చేసిపారేసింది. దాంతో ప్రేక్షకులు కూడా బయిట ఎండల నుంచి తప్పించుకునేందుకు మార్గంగానే భావిస్తున్నారు తప్ప సినిమాను పెద్దగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనపడటంలేదు. అయితే మరీ ఆత్మహత్యలు చేసుకోవాలని తలంపు తెచ్చే సినిమాలు కన్నా ఇది బెటర్ అని అనిపించి ఓకే చేయిస్తుంది.

సీమ టపాకాయ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

సీమ టపాకాయ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+