సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు ప్రధానపాత్రాలలో నటించారు. ఈసినిమాకి కధ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీజె మేయర్ స్వరాలు సమకుర్చారు.
కథ
రేలంగి ఊళ్లో మొదలయ్యే ఈ కథలో... ప్రక్కనున్న మనిషికి సాయం చేయడంలో ఉన్న సంతృప్తి డబ్బు సంపాదించడంలో ఉండదు అనుకునే ఓ ఆదర్శవంతమైన తండ్రి (ప్రకాష్ రాజ్). ఆయనకు ఇద్దరు కుమారులు. ఓ కుమార్తె. పెద్దోడు (వెంకటేష్) ఎవరితోనూ మాటపడకూడదనుకు... తనకి నచ్చినట్లు ఉండాలనుకునే తత్వం ఉన్నవాడు. ఇక చిన్నోడు (మహేష్ బాబు) మాటలతో నెగ్గుకొచ్చేగయలడు. పెద్దోడు ముక్కు సూటి తనంతో ఎక్కడా ఉద్యోగం చేయలేక, ఖాళీగా ఉండి.. ఊళ్లో... బంధువుల్లో ఓ టాపిక్ గా మారతాడు. మరో ప్రక్క పెద్దోడు మరదలు సీత(అంజలి).. చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకోవటంతో వాళ్ల ఇంట్లోనే ఉంటుంది. పెద్దోడికే ఇచ్చి సీతను పెళ్లి చేద్దామనుకుంటూంటారు. అయితే పెద్దోడుకి లౌక్యం తెలియదని, డబ్బు సంపాదించటం తెలియదని, సీత తండ్రి తరుపు వాళ్లు వివాహానికి ఒప్పుకోరు. మరో ప్రక్క... సీతకు చెల్లి వరస అయ్యే గీత (సమంత) ఓ పెళ్లిలో చూసి... చిన్నోడుకి మనసిచ్చేస్తుంది. ఈలోగా చెల్లి పెళ్లిలో జరిగిన ఓ సంఘటన ఈ కుటంబంలో కలతలు రేపుతుంది.... తమ ప్రేమలకు అడ్డుగా నిలుస్తుంది. ఆ సమస్యలను కేవలం మంచితనం అనే ఆయుధంతో ఈ కుటుంబం ఎలా ఎదుర్కొని... తమ ఆకాంక్షలను నెరవేర్చుకుని కుటుంబం సంతోషాన్ని సాధించింది అనేది మిగతా కథ.