సీటీమార్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోఫిచంద్, తమన్నా, దిగంగనా సూర్యవంశీ, భూమిక చావ్లా నటించారు. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిచారు. మణిశర్మ సంగీతం అందించారు.
కథ
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం కి చెందిన కార్తీక్(గోపీచంద్) కబడ్డీ ఆటగాడు. స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సంపాదించి సొంత ఊరిలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. తండ్రి చిన్నప్పుడే మరణించగా తల్లి(ప్రగతి), అక్క భూమి(భూమిక)లే ప్రాణంగా గడుపుతుంటాడు. అలాగే తన తండ్రి ఆస్తిపాస్తులన్నీ అమ్మి కట్టించిన స్కూల్ పిల్లలకి కబడ్డీ కోచ్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. స్కూల్ ఉనికే ప్రమాదంలో పడటంతో ఆ స్కూల్ ని తిరిగి దక్కించుకోవాలి అంటే కబడ్డీ ఆట ద్వారా నేషనల్లో విన్ అయితే ఒక అవకాశం ఉంటుందని తద్వారా ప్రయత్నం చేస్తుంటారు. నేషనల్ కబడ్డీ పోటీలకు ఢిల్లీ వెళ్లగా అక్కడ ఈ జట్టు అనూహ్యమైన పరిస్థితుల్లో కిడ్నాప్ గురవుతుంది. కిడ్నాప్ కు గురైన జట్టు మళ్ళీ కబడ్డీ ఆడిందా? అసలు ఈ జట్టును కిడ్నాప్ చేసింది ఎవరు? తిరిగి కార్తీక్ ఊరికి స్కూల్ దక్కుతుందా? అనేదే ఈ సినిమా కథ.