శక్తి సినిమా యాక్షన్ డ్రామా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టీఆర్, ఇలియానా, సోనూ సూద్, ప్రభు, మంజరి, జాకీష్రాఫ్, పూజాబేడీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్ నిర్వహించారు మరియు నిర్మాత సి అశ్వనీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
సెంట్రల్ హోం మినిస్టర్ మహదేవరాయలు(ప్రభు)కి ఐశ్వర్య(ఇలియానా)ఒక్కత్తే కూతురు. ఆమెకి తన చుట్టూ ఉన్న సెక్యూరిటీ బంధనాలు తెంచుకుని స్వేఛ్చగా విహరించాలని కోరిక.దాంతో ఓ శుభముహూర్తాన్న ఇంట్లో వాళ్ళకి బురిడీకొట్టి జైపూర్ లో తేలుతుంది.అయితే ఆమెకు అక్కడ లోకల్ రౌడీలతో సమస్య ఎదురౌతుంది.అప్పుడు మన హీరో శక్తి(ఎన్టీఆర్)ఓ పెద్ద ఫైట్ తో ఎంట్రీ ఇస్తాడు.అక్కడనుంచి ఆమెకు గైడ్ లా వ్యవహిస్తూ దేశమంతటా తిరుగుతూ ఎప్పటికప్పుడు రక్షిస్తూంటాడు.ఇంతకీ ఆమెపై దాడి చేస్తుందెవరు...గైడ్ అయిన శక్తికి ఆమె చుట్టూ తిరుగుతూ రక్షించే అవసరం ఏమి వచ్చింది.అసలు శక్తి ఎవరు..శక్తికీ ఈజిప్టులో ఫక్తూన్(పూజాబేడి) కి సంభంధం ఏమిటన్నది మిగతా కథ.