సింధూరం సినిమా డ్రామా, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో శివ బాలాజీ, ధర్మ, బ్రిడిగా సాగా, రవి వర్మ, ఆనంద చక్రపాణి, మీర్, నాగ మహేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్యామ్ తుమ్మలపల్లి వహించారు. నిర్మాత ప్రవీణ్ రెడ్డి నిర్మించారు. సంగీతం గౌవ్రా హరి అందించారు.
కథ
ఖమ్మం జిల్లా పినపాకకు చెందిన రవి (ధర్మ), శిరీష (బ్రిడిగా సాగా) కాలేజీలో ఫ్రెండ్స్. ధర్మ బాడ్మింటన్‌లో జాతీయ స్థాయిలో ఆడాలని కలలు కంటాడు. శిరీష ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి తన సొంత ఊరుకు ఎంఆర్‌వోగా వస్తుంది. రవి, శిరీషకు ఒకరంటే మరొకరికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అయితే ఓ కారణంగా బాడ్మింటన్ ఆటకు దూరమై ధర్మ నక్సల్స్ సానుభూతిపరుడిగా మారుతాడు. ఉద్యోగాన్ని వదిలేసి శిరీష రాజకీయాల్లోకి వస్తుంది. అయితే శిరీషను అదే ప్రాంతంలోని సింగన్న (శివబాలాజీ) దళం టార్గెట్ చేస్తుంది. ధర్మ బాడ్మింటన్ ఆటకు దూరమై నక్సల్స్‌తో ఎందుకు చేతులు కలిపాడు? శిరీష ఎంఆర్వో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి చేరింది? నక్సల్స్‌ను, ధర్మను మార్చేందుకు శిరీష ఎందుకు ప్రయత్నించింది? నక్సల్స్‌తో చేతులు కలిపిన తర్వాత ధర్మ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? కథలో రైతుకూలి సంఘం నాయకుడు నరసింహంను, రాజకీయ నేత ఈశ్వర్ రెడ్డి (రవివర్మ)ను ఎవరు హత్య చేశారు. పోలీసులకు, నక్సల్స్ మధ్య పోరాటం వల్ల గ్రామస్థులు ఎలా నలిగిపోయారు? చివరకు ధర్మ, శిరీష ఒక్కటయ్యారా? నక్సల్స్, పోలీసుల పోరాటానికి ఎవరెవరు బలయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానమే సిందూరం సినిమా కథ.