twitter

    సార్ స్టోరి

    సార్ సినిమా యక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుష్, సంయుక్త మీనన్, సాయి కుమార్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకీ అట్లూరి వహించారు. నిర్మాతలు నాగ వంశి, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. సంగీతం జి వి ప్రకాష్ కుమార్ అందించారు. 

     కథ.
    త్రిపాఠి విద్యాసంస్థల అధినేత త్రిపాఠి (సముద్రఖని) కాలేజీలో బాల గంగాధర తిలక్ అలియాస్ బాలు (ధనుష్) లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. అయితే మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్‌గా చేసి విద్యను వ్యాపారంగా భావించే త్రిపాఠి ప్రభుత్వ కళాశాలను తన ఆధీనంలోకి తీసుకొని.. అక్కడికి నాసిరకంగా లెక్చరర్లను నియమించి గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాలను నాశనం చేయాలని కుట్ర పన్నుతాడు. త్రిపాఠితో మీటింగ్ సందర్భంగా తనకు కేటాయించిన సిరిపురం కాలేజీలో విద్యార్థులందర్నీ పాస్ చేస్తే ప్రమోషన్ ఇస్తావా? అని ప్రశ్నిస్తాడు. దాంతో నీ కాలేజీలో విద్యార్థులందరిని పాస్ చేయిస్తే..నా కార్పోరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్‌గా ప్రమోట్ చేస్తానని త్రిపాఠి సవాల్ విసురుతాడు,

    సిరిపురం కాలేజీలో నియమించిన బాలుకు ఎదురైన సమస్యలు ఏమిటి? సిరిపురం గ్రామంలో చదువుకు దూరమైన విద్యార్థులను కాలేజీకి బాలు ఎలా రప్పించాడు? సిరిపురం కాలేజీలో బయోలాజి లెక్చరర్ మీనాక్షి (సంయుక్త)తో ఎలా ప్రేమలో పడ్డాడు? కాలేజీలో విద్యార్థులను పాస్ కాకుండా ఫస్ట్ క్లాస్‌లో పాస్ చేయించిన బాలుపై త్రిపాఠి విద్వేషం ఎందుకు పెంచుకొన్నాడు? త్రిపాఠి పన్నిన కుట్రకు బలైన బాలు ఎలా ప్రతిఘటించాడు? బాలు జీవితంలో కీలకమైన వ్యక్తి ఏఎస్ మూర్తి (సుమంత్) ఎవరు? సిరిపురం విద్యార్థులకు బాలు ఎలాంటి స్పూర్తిని అందించాడు అనే ప్రశ్నలకు సమాధానమే సార్ సినిమా

    స్టోరీ లైన్
    డబ్బు, చదువు ఇంపార్టెన్స్ చెప్పే కోణంలో..  విద్యా వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించిన ఒక పెద్ద మనిషిపై ఒక లెక్చరర్ సాగించిన పోరాటమే ఈ సినిమా.

    రిలీజ్ 

    ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.  తమిళంలో 'వాతి' టైటిల్ తో ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది 



    **Note:Hey! Would you like to share the story of the movie సార్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X