సైజ్ జీరో సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనుశ్క శేట్టి, శృతి హసన్, ఆర్య, ప్రకాష్ రాజ్, ఊర్వషి, సొనల్ చొహన్,నాగార్జున అక్కినేని, మాస్టర్ భరత్, మారుతిరావు గొల్లపూడి తదితరులు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నరు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రకాష్ కోవేలమూడి నిర్వహిస్తున్నరు మరియు నిర్మాత ప్రసాద్ వి పొట్లురి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
చిన్నప్పటి నుంచి బొద్దుగా,లావుగా ఉండే సౌందర్య అలియాస్ స్వీటీ (అనుష్క)కు ఎన్ని సంభంధాలు వచ్చినా సెట్ అవ్వవు. ఆమె శరీర తీరే ఆమెకు అడ్డమవుతూంటుంది. అదే ప్రాసెస్ లో పెళ్లి చూపులకు వచ్చిన అభి(ఆర్య)తో పెళ్లి కుదరకపోయినా ఫ్రెండ్షిప్ కుదురుతుంది. అది స్నేహం నుంచి ప్రేమగా మారుతున్న సమయంలో అభి జీవితంలోకి సిమ్రాన్ (సోనాలి చౌహాన్) ఎంటరవుతుంది. దాంతో తన ప్రేమ సక్సెస్ కాదని అర్దం చేసుకున్న స్వీటీ ...ముందు తన లావు తగ్గించుకోవాలని ఫిక్స్ అవుతుంది. అందుకోసం సత్యమూర్తి (ప్రకాష్ రాజ్) నడిపే సైజ్ జీరో సంస్ధ లో చేరుతుంది. అయితే అక్కడ వెయిట్ లాస్ పోగ్రామ్ లో ఇస్తున్న ఫుడ్, డ్రింక్స్ వల్ల కిడ్నీలు పాడవుతున్నాయిని తెలుసుకుని ఆ సంస్దపై యుద్దం ప్రకటిస్తుంది. అంతేకాదు...అప్పటికే అక్కడ చేరి ఆరోగ్యం పోగొట్టుకున్న స్నేహితురాలు జ్యోతి కు సాయిం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం స్వీటీ ఏం చేసింది. తను అనుకున్న లక్ష్యం చేరిందా...అభితో ప్రేమ వ్యవహారం ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.