స్కెచ్ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్, తమన్నా తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ చందర్ వహించారు మరియు సంగీతం తమన్ ఎస్ స్వరాలు సమకుర్చరు.
కథ
స్కెచ్ (విక్రమ్) లోన్ వాయిదాలు కట్టకపోతే వాహనాలను ఎత్తుకొచ్చే రికవరీ ఏజెంట్. సేట్ అనే వ్యాపారి (హరీష్ పెరాడీ) వద్ద పనిచేస్తుంటాడు. ముగ్గురు మిత్రులతో కలిసి వ్యవహారాలు నిర్వహిస్తుంటాడు వాహనాలు ఎత్తుకొచ్చే క్రమంలో అమ్ము (తమన్నా)తో ప్రేమలో పడుతాడు. కథ ఇలా సాగుతుండగా, కుమార్ అనే మాఫియా గ్యాంగ్ లీడర్ కారు ఎత్తుకు రావడం వల్ల స్కెచ్‌కు సమస్యలు ప్రారంభమవుతాయి. ప్రత్యర్థి వర్గం నుంచి తనకు ఎదురైన సమస్యలను ఎలా ఎదురించాడు? ప్రేమించిన తమన్నాను పెళ్లి చేసుకొన్నాడా? తనతో కలిసి పనిచేసే మరో ముగ్గురు స్నేహితులను ఏ పరిస్థితుల్లో కోల్పోయాడు? తన స్నేహితులను ఎవరు మట్టుపెట్టారు? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే స్కెచ్ సినిమా కథ.