సోగ్గాడే చిన్నినాయన సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అక్కినేని నాగార్జున, రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాటి, హంస నందిని, అనసూయ, బ్రహ్మానందం, బ్రహ్మాజి, చలపతి రావు, వెన్నేల కిశోర్ తదితరులు ఇతర ప్రధానపాత్రలలో నటిస్తున్నారు. ఈసినిమాకి దర్శకత్వం కళ్యాణ్ క్రిష్ణ నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత రామ్ మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూఫ్ రుబెన్స్ స్వరాలు సమకుర్చరు.
కథ
కథ విషయానికొస్తే...గోదావరి జిల్లాల్లో శివపురంకు చెందిన బంగార్రాజు(నాగార్జున) గురించి తెలియని వారుండరు. అమ్మాయిలు ఆయనంటే పడి చస్తాడు. సోగ్గాడిగా పేరు తెచ్చుకుంటాడు. ఓ యాక్సిడెంటులో బంగార్రాజు చనిపోతాడు. ఆయన కొడుకు డా. రామ్ (నాగార్జున) అమెరికాలో కార్డియాలజిస్టుగా పని చేస్తుంటాడు. కుటుంబం కంటే పనినే ఎక్కువ ప్రేమిస్తాడు. దీంతో అతని భార్య సీత (లావణ్య త్రిపాఠి) భర్త తీరుపై అసంతృప్తిగా ఉంటుంది. ఓ రోజు ఇద్దరూ ఉన్నట్టుండి సొంతూరు శివపురంకు వస్తారు. వచ్చిన తర్వాత విషయాన్ని రామ్ తల్లి, తన అత్తగారైన సత్యభామ (రమ్యకృష్ణ) చెబుతుంది. అతనితో తాను కాపురం చేయలేనని, విడాకులు కావాలని అంటుంది. కోడలు చెప్పిన మాటవిని షాకవుతుంది సత్యభామ. కొడుకు తన భర్త బంగార్రాజు(నాగార్జున)లా కాకూడదని పద్దతిగా పెంచితే చివరకి ఇలా అయిందే అని భాధ పడుతుంటే ఉన్నట్టుండి బంగార్రాజు ఆత్మ ప్రత్యక్షమవుతుంది. వీరిద్దరూ కలిసి తమ కొడుకు కాపురాన్ని ఎలా సరిద్దారు? బంగార్రాజు చావుకు కారణమేంటి? అనేది తర్వాతి కథ.