twitter

    సోలో బ్రతుకే సో బెటర్ స్టోరి

    సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, వరుణ్ తేజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు నటించారు.సుబ్బు అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం 

    కథ
    ప్రేమలు, పెళ్లిళ్లు, బంధాలు, అనుబంధాలంటే పట్టని విరాట్ (సాయిధరమ్ తేజ్) వైజాగ్‌లోని ఓ కాలేజీలో విద్యార్థి. లవ్, మ్యారేజ్, ఎమోషన్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సోలో బ్రతుకే సో బెటర్ అనే పుస్తకాన్ని రచిస్తాడు. తనకు బ్రహ్మచారులుగా ఎంతో ఖ్యాతి సంపాదించిన మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సంఘ సేవకురాలు మదర్ థెరిస్సా, లతా మంగేష్కర్, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తిని ఆదర్శంగా భావిస్తాడు. అలా బ్రహ్మచారిగా ఉండాలని, పెళ్లికి విరుద్ధంగా ఉండాలనుకొంటున్న సమయంలో ఓ సంఘటన తన జీవితంలో ఊహించని మార్పు తెస్తుంది. ఈ క్రమంలో తన సిద్దాంతాలను, భావాలను ఇష్టపడే అమృత (నభా నటేష్) తన జీవితంలోకి వస్తుంది. పెళ్లి చేసుకోవద్దని శపథం చేసిన విరాట్ జీవితంలో చోటుచేసుకొన్న మార్పు ఏమిటి? తనను అమితంగా ఇష్టపడే అమృత విరాట్ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. మామ వేణు (రావు రమేష్) విరాట్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాడు. ఏ పరిస్థితుల్లో తన సిద్దాంతాన్ని మార్చుకోవడానికి విరాట్ సిద్ధపడ్డాడు అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం.
    **Note:Hey! Would you like to share the story of the movie సోలో బ్రతుకే సో బెటర్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X