X
తెలుగు » సినిమాలు » సోలో బ్రతుకే సో బెటర్
సోలో బ్రతుకే సో బెటర్

సోలో బ్రతుకే సో బెటర్

Romance | 25 Dec 2020 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

సోలో బ్రతుకే సో బెటర్ స్టోరీ

సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, వరుణ్ తేజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు నటించారు.సుబ్బు అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం  కథ ప్రేమలు, పెళ్లిళ్లు, బంధాలు, అనుబంధాలంటే పట్టని విరాట్ (సాయిధరమ్ తేజ్) వైజాగ్‌లోని ఓ కాలేజీలో విద్యార్థి. లవ్, మ్యారేజ్, ఎమోషన్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సోలో బ్రతుకే సో బెటర్ అనే పుస్తకాన్ని రచిస్తాడు. తనకు బ్రహ్మచారులుగా ఎంతో ఖ్యాతి సంపాదించిన మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సంఘ సేవకురాలు మదర్ థెరిస్సా, లతా మంగేష్కర్, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తిని ఆదర్శంగా భావిస్తాడు. అలా బ్రహ్మచారిగా ఉండాలని, పెళ్లికి విరుద్ధంగా ఉండాలనుకొంటున్న సమయంలో ఓ సంఘటన తన జీవితంలో ఊహించని మార్పు తెస్తుంది. ఈ క్రమంలో తన సిద్దాంతాలను, భావాలను ఇష్టపడే అమృత (నభా నటేష్) తన జీవితంలోకి వస్తుంది. పెళ్లి చేసుకోవద్దని శపథం చేసిన విరాట్ జీవితంలో చోటుచేసుకొన్న మార్పు ఏమిటి? తనను అమితంగా ఇష్టపడే అమృత విరాట్ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. మామ వేణు (రావు రమేష్) విరాట్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాడు. ఏ పరిస్థితుల్లో తన సిద్దాంతాన్ని మార్చుకోవడానికి విరాట్ సిద్ధపడ్డాడు అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం.
Read More

సోలో బ్రతుకే సో బెటర్ కాస్ట్ & క్రూ

సోలో బ్రతుకే సో బెటర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుబ్బు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత బీ వీ ఎన్ ఎస్ ప్రసాద్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సోలో బ్రతుకే సో బెటర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
జీవితంలో ఒంటరి జీవితంలో ఉండే మజా.. వైవాహిక జీవితంలో ఉండదంటూ విరాట్ చేసే ప్రచారంతో కథ మొదలవుతుంది. అయితే కథనంలో వేగం లేకపోవడంతో సినిమా ప్రథమార్థం రొటీన్‌గా సాగుతుంది. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు కథా ముడిసి సరుకు మారిన తర్వాత కొంత జోష్ కనిపిస్తుంది. కానీ మరో లెవెల్‌కు చేరేంతగా లేకపోవడం లోపంగా మారినట్టు కనిపిస్తుంది. కాకపోతే రావు రమేష్ ఎమోషనల్ సీన్లు కథలోకి వచ్చిన తర్వాత సినిమా ఫీల్‌గుడ్‌గా మారినట్టు కనిపిస్తుంది. లాక్‌డౌన్ కాలంలో థియేటర్లకు దూరమైన ప్రేక్షకులకు సినిమాటిక్ అనుభూతిని, ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌ను తప్పకుండా పొందే చిత్రంగా సోలో బ్రతుకే సో బెటర్‌ రూపొందిందని చెప్పవచ్చు. యూత్ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్న రొమాంటిక్, కామెడీ, ఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు.

సోలో బ్రతుకే సో బెటర్ ట్రైలర్

Video Thumbnail

సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సోలో బ్రతుకే సో బెటర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+