సన్ ఆఫ్ ఇండియా (2022)(U/A)
Release date
18 Feb 2022
genre
సన్ ఆఫ్ ఇండియా స్టోరి
సన్ ఆఫ్ ఇండియా సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్య జైస్వాల్, తనికెళ్ళ భరణి, అలీ, పృథ్వి రాజ్, రఘు బాబు, రాజా రవీంద్ర, రవి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డైమండ్ రత్న బాబు వహించారు. మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు.
కథ
కేంద్ర మంత్రి(శ్రీకాంత్), డాక్టర్ ప్రతిభా లాస్య, దేవాదయ చైర్మన్(రాజా రవీంద్ర) అనూహ్య పరిస్థితులలో కిడ్నాప్ కు గురవుతారు. కేంద్ర మంత్రిని కిడ్నాప్ చేసిన వ్యక్తి మరో ఇద్దరిని కిడ్నాప్ చేసినట్లు తేలడంతో కేంద్ర మంత్రి కిడ్నాప్ కేసును ఛేదించడం కోసం నియమించబడిన ప్రత్యేక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టీం ఆ కేసులను కూడా హ్యాండోవర్ చేసుకుంటుంది. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ స్పెషల్ ఆఫీసర్ ఐరావతి(ప్రగ్యా జైస్వాల్) ఈ కిడ్నాపులు అన్నీ చేసింది తమ వద్ద టెంపరరీ డ్రైవర్ గా జాయిన్ అయిన బాబ్జి (మోహన్ బాబు) అని తెలుసుకుంటుంది. అలాగే అతని అసలు పేరు విరూపాక్ష అని కూడా తెలుసుకుంటుంది. చివరికి ఐరావతి తన టీంతో కలిసి కిడ్నాప్ అయిన ముగ్గురు సెలబ్రిటీలను కాపాడుతుందా? అసలు విరూపాక్ష వారందరినీ ఎందుకు కిడ్నాప్ చేశాడు? వారి డ్నాప్ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie సన్ ఆఫ్ ఇండియా with us? Please send it to us ([email protected]).