స్పైడర్ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు స్టైలిష్ ఇంటెలిజెన్స్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు ఇంకా రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, భరత్, నధియ, ప్రియదర్శి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఆర్ మురుగదాస్ వహించారు మరియు నిర్మాతలు ఠాగుర్ మధు, నల్లమలపు శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్ స్వరాలు అందించారు.
కథ
శివ (మహేశ్ బాబు) ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ప్రమాదాలు జరుగకముందే వాటిని ఆదుకోవాలన్న లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలో చేరుతాడు. కొత్త సాఫ్ట్‌వేర్లు కొనుగొని ఆపదలను ముందే పసిగట్టి వాటిని నివారిస్తుంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీలో జంట హత్యలు జరుగుతాయి. వాటి వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి వేట ప్రారంభిస్తాడు. జంట హత్యలకు భైరవ (ఎస్‌జే సూర్య) కారణమని తెలుసుకొంటాడు. భైరవ ఎందుకు హత్యలు చేస్తుంటాడు? భైరవ వికృత క్రీడకు శివ ఎలా ముగింపు పలికాడు. భైరవను తుదముట్టించే క్రమంలో శివ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఈ కథలో ఛార్లీ ( రకుల్ ప్రీత్) పాత్ర ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే స్పైడర్.