సుస్వాగతం సినిమా రోమ్యాంటి కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, దేవయాని, రఘువరణ్, ప్రకాష్ రాజ్, సుధాకర్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బీమినేని శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ బి చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకుర్చారు.
కథ
గణేష్ (పవన్ కళ్యాణ్) ఒక కాలేజిలో డిగ్రీ పూర్తిచేసువుంటాడు తను నాలుగు సంత్సరాలుగా సంధ్య (దేవయాని)ని ప్రేమిస్తుంటాడు కాని ఆమే పట్టించుకోదు. గణేష్ స్నేహితుడు పేటర్ (కరణ్) మొక్క స్నేహితురాలు(సాధిక) సంధ్య కూడా భాగ తేలిసిన అమ్మాయిని గణేష్ ప్రేమకు సహకరిస్తుంది. గణేష్ సంధ్య పుట్టినరోజు తన ప్రేమను సాధిక ద్వరా తేలియజేస్తాడు కాని తన తండ్రి (ప్రకాష్ రాజ్) కు తేలిసిపోతుంది. ఇదంతా తేలిసిన గణేష్ తండ్రి (రఘువరణ్) సంధ్య వాళ్ళ నాన్న తో వీళ్ళ ప్రేమ గురించి మాట్లాడిన ప్రమోజనం ఉండదు. అక్కడ నుంచి సంధ్య వాళ్ళ నాన్న తన చేల్లెలు ఇంటికి తన ఫ్యమిలి తో హైదరాబాద్ వేళ్ళలి అనూకుంటాడు కాని మార్గమద్యం లో తన మనసుని మార్చుకోని తిరిగి వస్తాడు...ఇది తేలియని గణేష్ సంధ్య కోసం హైదరాబాద్ కి వేల్తాడు అప్పుడే గణేష్ నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ విషయాని గణేశ్ కు తేలియజేయడాని గణేష్ స్నేహితులు చాలా ప్రయత్నాలు చేస్తారు. గణేష్ ఇంటికి వచ్చే సరికి వాళ్ల నాన్న దహన సంస్కర్నలు తన స్నేహితులు పూరి చేస్తారు. చివరికి సంధ్య గణేష్ ప్రేమను తేలుసుకోని తన కోసం వస్తుంది. గణేష్ సంధ్యలు కలుసుకుంటారా? లేదా అనేది మిగతా కథ..