తేజ్ ఐ లవ్ యు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరణ్, జయప్రకాష్ వి, పృథ్వీ, వైవా హర్ష, సురేఖా వాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ కరుణాకరణ్ వహించారు మరియు నిర్మాత కె ఎస్ రామా రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు.
కథ
తేజ్ (సాయిధరమ్ తేజ్) తన స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ నడుపుతుంటాడు. చిన్నతనంలో ఓ కారణంగా జైలుశిక్ష అనుభవిస్తాడు. పెదనాన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి ఫ్యామిలీకి దూరమవుతాడు. ఈ క్రమంలో నందిని (అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడుతాడు. కానీ తేజ్‌ను వెతుక్కుంటూ నందిని లండన్ నుంచి ఇండియాకు వస్తుంది. తేజ్ పరిచయం ప్రేమగా మారుతుంది. తేజ్, నందిని ఇద్దరు తమ ప్రేమను వ్యక్తపరుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో నందిని యాక్సిడెంట్‌కు గురై గతాన్ని మరిచిపోతుంది.
తేజ్ ఎందుకు జైలుశిక్ష అనుభవించాడు? తేజ్ ఫ్యామిలికి ఎందుకు దూరమయ్యాడు? తేజ్‌ను ఎందుకు వెతుక్కొంటూ వచ్చింది? గతాన్ని మరిచిపోయిన నందినికి తేజ్ తన ప్రేమను వ్యక్తపరిచేందుకు ఏం చేశాడు? మరిచిపోయిన గతాన్ని నందిని గుర్తు తెచ్చుకొందా? చివరకు నందిని, తేజ్ ఒక్కటయ్యేందుకు ఎలాంటి అడ్డంకులను అధిగమించారు అనే ప్రశ్నలకు సమాధానమే తేజ్ ఐ లవ్ యూ చిత్రం కథ.