తెనాలి రామకృష్ణ BABL సినిమా కామిడి, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, హన్సిక, మురళీశర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్, బ్రహ్మానందం, వెన్నెలకిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘుబాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగేశ్వర రెడ్డి జి వహించారు మరియు నిర్మాత అగ్రరామ్ నాగి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర అందించారు.
కథ
కర్నూలు సిటీలో వరలక్ష్మీ దేవీ (వరలక్ష్మీ శరత్ కుమార్), సింహాద్రి నాయుడు (అయ్యప్ప పీ శర్మ) మధ్య ఆదిపత్య పోరు జరుగుతుంది. వరలక్ష్మీ దగ్గర పని చేసే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ కేసులో వరలక్ష్మీని ఇరికించాలని సింహాద్రి నాయుడు ప్రయత్నిస్తాడు. వరలక్ష్మీ తరుపున వాదించే క్రిమినల్ లాయర్ మురళీ శర్మ.. ఆమెను మోసం చేస్తున్నాడని తెలుసుకున్న తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ఆ కేసును టేకప్ చేస్తాడు. మరి చివరకు ఆ కేసు ఏమైంది? అన్నదే కథ.