తుంటరి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, లత హెగ్దె, కబీర్ దుహాన్ సింగ్, వెన్నెల కిశోర్, సుధర్శన్, పూజిత, అదుర్స్ రఘు, అలీ, శకలక శంకర్, తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం కుమార్ నాగేంద్ర నిర్వహించారు మరియు నిర్మాత అశోక్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఒక్కొక్కరికీ జీవితంలో ఒక్కోసారి అద్బుతం జరిగి లైఫ్ టర్న్ అయ్యేలా చేస్తాయి. అలాంటి అల్లావుద్దీన్ అద్బుత దీపమే వైజాగ్ టెలికాం కాలనీకి చెందిన రాజు (నారా రోహిత్)కు దొరికేసింది. అంటే మరీ దీపం కాదు కానీ... తన కోరికలు తీర్చే ఐదుగురు (కిషోర్ బ్యాచ్ ) దొరికారు. వాళ్లకు బేవార్స్ గా తిరిగే రాజుతో అవసరాలు ఉన్నాయి. ఆ కోరికలు తీరుస్తామంటూ... వాళ్లో కండీషన్ పెట్టారు... భాక్సింగ్ ప్రాక్టీస్ చేసి గెలవాలని. అందుకోసం ట్రైనింగ్ కు అయ్యే ఖర్చుభరిస్తామని, నెలకు లక్ష ఇస్తామని. తనకు భాక్సింగ్ రాకపోయినా వాళ్లిచ్చే ఎట్రాక్ట్ చేసే ప్యాకేజ్ చూసి ఓకే చేస్తాడు. అప్పటినుంచీ తను భాక్సింగ్ ప్రాక్టీస్ కు వెళ్లాలంటే తన గొంతెమ్మ కోరికలు తీర్చాలంటూ వాళ్లను వేధిస్తాడు. అంతేనా...తను ఇష్టపడ్డ సిరి(లతా హెగ్డే) కు లవ్ సెట్ చేయమంటాడు. ఇలా కోరికలు అన్నీ తీర్చి రాజుని భాక్సర్ గా రెడీ చేస్తున్న సమయంలో వాళ్లకి షాక్ అయ్యే విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏమిటి..ఈ రాజు వెనక వాళ్లు పడటానికి కారణం ఏమిటి...మధ్యలో ఈ భాక్సింగ్ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.