త్రిపుర సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో స్వాతి, నవీన్ చంద్ర, రావు రమేష్, సప్తగిరి, శ్రీమన్, పూజ, షకలక శంకర్, ధన్ రాజ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజ్ కిరణ్ నిర్వహించారు మరియు నిర్మాతలు చిన్నబాబు అరిగెల, ఎమ్ రాజశేఖర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కమ్రాన్ అహ్మద్ స్వరాలు సమకుర్చారు.
కథ
తింగరితనం, కాస్త గడుసుతనం కలిగిన పల్లెటూరి అమ్మాయి త్రిపుర(కలర్స్ స్వాతి) కి చిన్నప్పటినుంచి కొన్ని కలలు వస్తుంటాయి. అయితే ట్విస్ట్ ఏమిటంటే... ఆ కలలు ..కలలుగా మిగిలిపోకుండా... రియల్ లైఫ్‌లో నిజం అవుతుంటాయి. దాంతో ఆమెను డాక్టర్ చంద్ర(నవీన్ చంద్ర)దగ్గరకు తీసుకు వెళ్తారు. కలలు మాటేమో కానీ వీళ్లిద్దరూ ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటారు. దాంతో వారు సిటీలో కాపురం పెడతారు. అయితే ఇక్కడా ఆమె కలలు కంటిన్యూ అవుతాయి. ఆమె వైవాహిక జీవితం సజావుగా సాగదు. తన వైవాహిక జీవితానికి ఈశ(పూజ)కు సంభంధం ఉందని తెలుసుకుంది. అక్కడో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇంతకీ ఈశ ఎవరు...అసలు ఈ కలలు నిజం అవటం ఏమిటి... వీటి వెనక ఉన్న రహస్యం ఏమిటి...అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.