twitter

    యూ టర్న్ స్టోరి

    యూ టర్న్ సినిమా మిస్టరీ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సమంత, ఆది పినిశెట్టి, రహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పవన్ కుమార్ వహించారు మరియు నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం పూర్ణచంద్ర అందించారు. 

    కథ

    రచన ఓ ఆంగ్ల దినపత్రికలో పనిచేసే ట్రైనీ రిపోర్టర్. అదే ఆఫీస్‌లో పనిచేసే ఆదిత్య (రాహుల్ రవీంద్రన్), రచనకు ఒకరంటే మరొకరి ఇష్టం. ఈ క్రమంలో రోడ్డుపై డివైడర్‌ను తొలగించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారంతా చనిపోతుంటారు. ఆ కోణంలో పరిశోధన చేస్తున్న క్రమంలో రచన ఓ మరణం కేసులో అడ్డంగా ఇరుక్కుపోతుది. దాంతో సాఫీగా సాగిపోతున్న జీవితం పోలీసుల మధ్య నలిగిపోతుంది. ఈ వ్యవహారంలో అండగా నిలిచిన నాయక్ (ఆది పినిశెట్టి)కు సస్పెండ్ అవుతాడు. రోడ్డుపై డివైడర్‌ను తొలగించిన వారు చనిపోవడం వెనుక మిస్టరీ ఏమిటీ? తనపై పడిన నేరారోపణలను నుంచి రచన ఎలా బయపడింది. నాయక్‌ ఎందుకు సస్పెండ్ అయ్యాడు. ఈ చిత్రంలో మాయ (భూమిక) పాత్ర ఏమిటి? దాదాపు 20 మరణాలకు కారణమేమిటి అనే ప్రశ్నలకు సమాధానమే యు టర్న్ సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie యూ టర్న్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X