ఊ కోడతారా ఊలిక్కిపడతారా సినిమా యాక్షన్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, మంచు మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, ప్రభు, సుహాసిని, భానుచందర్, పృథ్వీ, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ రాజా నిర్వహించారు మరియు నిర్మాత మంచు లక్ష్మిప్రసన్న నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు బెబో శశి స్వరాలు సమకుర్చరు.
కథ
గతంలో ఓ వెలుగు వెలిగిన గంధర్వ మహల్ కి అద్దెకు వస్తాడు ఓ యువకుడు(మంచు మనోజ్). అప్పటికే ఆ గంధర్వ మహల్ ని అక్రమంగా ఆక్రమించుకుని ఉన్నవారిని గెంటేసి, ఆ మహల్ ప్రస్తుత యజమాని (ప్రభు)ని మంచి చేసుకుంటాడు. అంతేగాక ఆయన కూతురు (దీక్షాసేధ్)ని ప్రేమలో దింపే ప్రయత్నం చేస్తూంటాడు. అయితే ఓ రోజు అతనికి ఆ గంధర్వమహల్‌కు అధిపతి నరసింహరాయుడు (బాలకృష్ణ) ఆత్మ కనిపించి భయపెట్టి, వార్నింగ్ ఇస్తుంది. పోనీ పారిపోదామంటే అక్కడ నుంచి వెళ్లనివ్వకుండా అడ్డు పడుతుంది. ఇంతకీ నరసింహ నాయుడు కథ ఏమిటి... నరసింహరాయుడు కుటుంబానికి ఆ యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి... గంధర్వ మహల్ ను రక్షించే క్రమంలో ఆ యువకుడుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మిగిలిన కథ.