ఉయ్యాల జంపాలా సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్‌తరుణ్, అవిక, అనితా చౌదరి, రవివర్మ తదితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విరించి వర్మ నిర్వహించారు మరియు నిర్మాతలు నాగార్జున అక్కినేని, రామ్మోహన్ పి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సన్నీ ఎం ఆర్ స్వరాలు సమకుర్చారు.
కథ
గోదావరి జిల్లాలో ఓ పల్లెలో మొదలయ్యే ఈ కథలో ... సూరి (రాజ్ తరుణ్), ఉమాదేవి (అవని..చిన్నారి పెళ్లికూతురు ఫేమ్) బావామరదళ్లు. ఒకరంటే మరొకరికి పడదు. ఎప్పుడు గిల్లికజ్జాలే. ఎత్తుకు పైఎత్తులు వేసుకొని కవ్వించుకొంటుంటారు.
ఆమెను ఉడికించటానికి సూరి...సునీత(పునర్నవి భూపాలం)తో ప్రేమలో పడినట్లు నటిస్తాడు. అయితే దానికి రిటార్ట్ గా..ఉమాదేవి.. పార్టు అనే కుర్రాడితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అతను మోసగాడు అని తెలుసుకుని బావా,మరదళ్లు బుద్ది చెప్తారు. తర్వాత వీరిద్దరి మధ్యా ప్రేమ మొలిచిందా..వాళ్లిద్దరూ ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.