X
వాసుకి
Family | Thriller | 28 Jul 2017 | U/A |
Telugu

వాసుకి స్టోరీ

వాసుకి సినిమా ఫ్యామిలి, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు మమ్ముటి, నయనతార, శెలు అబ్రహన్, రచన నరయనకుట్టి, శ్రీలత, పొన్నమ బాబు, అజు వర్గీస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ కె సజన్ వహించారు మరియు నిర్మాత ఎస్ ఆర్ మోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు.

కథ

వాసుకీ (నయనతార) కథక్ డ్యాన్సర్. ఆమె భర్త (మమ్ముట్టి) లాయర్, టీవీ యాంకర్. వాసుకీ దంపతులకు ఓ కూతురు ఉంటుంది. చక్కగా దాంపత్య జీవితం సాగుతుంటే వాసుకీ జీవితంలో దారుణమైన సంఘటన చోటుచేసుకొంటుంది. తాను ఉండే అపార్ట్‌మెంట్‌లోని ముగ్గురు యువకులు వాసుకీని రేప్ చేస్తారు. లైంగిక దాడికి గురైన వాసుకీ భర్తతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తుంది. కూతురుతో సరిగా మాట్లాడకుండా తనలో తాను మదనపడుతుంటుంది. ఈ క్రమంలో మహిళ పోలీసు అధికారి పరిచయం అవుతుంది. తనకు జరిగిన ఘోరమైన అన్యాయాన్ని తనతో చెప్పుకుంటుంది. అయితే నిందితులను కఠినంగా శిక్షిస్తానని హామీ ఇస్తుంది. అయితే పోలీసు అధికారి మాటలు వాసుకీకి నచ్చవు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ ముగ్గురిని తానే చంపుతాను అని అధికారికి స్పష్టం చేస్తుంది. వాసుకీ బాధను అర్థం చేసుకొన్న మహిళా పోలీసు అధికారి అందుకు ఒప్పుకుంటుంది. కానీ సాక్ష్యాలు లేకుండా వారిని చంపడానికి సహకరిస్తాను అని అండగా నిలుస్తుంది. అలా అధికారి సహకారంతో తనను రేప్ చేసిన ముగ్గురిని ఎలాంటి సాక్ష్యాలు లేకుండా హతమారుస్తుంది. కానీ పోలీసు అధికారి కాకుండా వేరొకరు ఈ హత్యలలో కీలకమని చివర్లో ట్విస్ట్‌తో సినిమా మరొ మలుపు తిరుగుతుంది. భర్త కాకుండా.. ముగ్గురు హత్యల వెనుక ఎవరు ఉన్నారు? ఆ ముగ్గురిని మరో వ్యక్తి ఎందుకు చంపాలనుకొంటాడు?. అతడికి వాసుకీ ఏమిటీ సంబంధం? అనే ప్రశ్నలకు సమాధానమే వాసుకీ చిత్రం. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+