X
వాసుకి

వాసుకి

Family | Thriller | 28 Jul 2017 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

వాసుకి స్టోరీ

వాసుకి సినిమా ఫ్యామిలి, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు మమ్ముటి, నయనతార, శెలు అబ్రహన్, రచన నరయనకుట్టి, శ్రీలత, పొన్నమ బాబు, అజు వర్గీస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ కె సజన్ వహించారు మరియు నిర్మాత ఎస్ ఆర్ మోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు. కథ వాసుకీ (నయనతార) కథక్ డ్యాన్సర్. ఆమె భర్త (మమ్ముట్టి) లాయర్, టీవీ యాంకర్. వాసుకీ దంపతులకు ఓ కూతురు ఉంటుంది. చక్కగా దాంపత్య జీవితం సాగుతుంటే వాసుకీ జీవితంలో దారుణమైన సంఘటన చోటుచేసుకొంటుంది. తాను ఉండే అపార్ట్‌మెంట్‌లోని ముగ్గురు యువకులు వాసుకీని రేప్ చేస్తారు. లైంగిక దాడికి గురైన వాసుకీ భర్తతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తుంది. కూతురుతో సరిగా మాట్లాడకుండా తనలో తాను మదనపడుతుంటుంది. ఈ క్రమంలో మహిళ పోలీసు అధికారి పరిచయం అవుతుంది. తనకు జరిగిన ఘోరమైన అన్యాయాన్ని తనతో చెప్పుకుంటుంది. అయితే నిందితులను కఠినంగా శిక్షిస్తానని హామీ ఇస్తుంది. అయితే పోలీసు అధికారి మాటలు వాసుకీకి నచ్చవు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ ముగ్గురిని తానే చంపుతాను అని అధికారికి స్పష్టం చేస్తుంది. వాసుకీ బాధను అర్థం చేసుకొన్న మహిళా పోలీసు అధికారి అందుకు ఒప్పుకుంటుంది. కానీ సాక్ష్యాలు లేకుండా వారిని చంపడానికి సహకరిస్తాను అని అండగా నిలుస్తుంది. అలా అధికారి సహకారంతో తనను రేప్ చేసిన ముగ్గురిని ఎలాంటి సాక్ష్యాలు లేకుండా హతమారుస్తుంది. కానీ పోలీసు అధికారి కాకుండా వేరొకరు ఈ హత్యలలో కీలకమని చివర్లో ట్విస్ట్‌తో సినిమా మరొ మలుపు తిరుగుతుంది. భర్త కాకుండా.. ముగ్గురు హత్యల వెనుక ఎవరు ఉన్నారు? ఆ ముగ్గురిని మరో వ్యక్తి ఎందుకు చంపాలనుకొంటాడు?. అతడికి వాసుకీ ఏమిటీ సంబంధం? అనే ప్రశ్నలకు సమాధానమే వాసుకీ చిత్రం.  
Read More

వాసుకి కాస్ట్ & క్రూ

వాసుకి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎ కె సజన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత ఎస్ ఆర్ మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వాసుకి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
చక్కగా సాగుతున్న ఓ మహిళ జీవితంలో దారుణ ఘటన చోటుచేసుకొంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది. తనకు జరిగిన అన్యాయానికి పగను ఎలా తీర్చుకుంటుంది అనే సింపుల కథను వెండితెర మీద వాసుకీగా మలిచాడు దర్శకుడు ఏకే సాజన్. మమ్ముట్టి, నయనతార దాంపత్య జీవితం, వారి మధ్య ఉన్న ప్రేమానురాలను ఎస్టాబ్లిష్ చేయడానికి తొలి భాగాన్ని దర్శకుడు సమర్థవంతంగా ఉపయోగించుకొన్నాడు. కానీ తొలి భాగంలో చాలా పేలవంగా సాగడం, కామెడీ లేకుండా మూస ధోరణిలో కథనం ఉండటం కొంత ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో నయనతార జరిగిన అన్యాయాన్ని రివీల్ చేసి రెండో భాగంపై ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. రెండో భాగంలో నయనతారపై జరిగే రేప్ సన్నివేశాన్ని ఉద్వేగభరితంగా చిత్రీకరించాడు దర్శకుడు. ఆ తర్వాత నయనతార చేసే మూడు హత్యలు ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. హీరోయిన్‌ ఓరియెంటెడ్ సినిమాను మమ్ముట్టి ఎందుకు ఒప్పుకొన్నాడు. ఎలాంటి ప్రధాన్యం లేని భర్త పాత్రను ఎందుకు అంగీకరించాడు అనే ప్రశ్నలు వచ్చే సమయానికి దర్శకుడు మంచి ట్విస్ట్ ఇస్తాడు. అక్కడి నుంచి మమ్ముట్టి పాత్ర పీక్ వెళ్తుంది. కానీ సెకండాఫ్‌లో కథకు తగిన ఎమోషన్స్, భావోద్వేగాలు అంతగా పండకపోవడం వల్ల ఓ యావరేజ్ సినిమా చేస్తున్నామనే ఫిలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా చివరి వరకు ఓ ట్విస్ట్ కోసం ప్రేక్షకుడు వేచి చూడాల్సి రావడం ఈ సినిమాలో ఓ మైనస్ పాయింట్. ఇటీవల వచ్చిన మామ్ సినిమా కూడా ఇలాంటి కథతోనే రూపొందడం మరో మైనస్ పాయింట్.

వాసుకి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వాసుకి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+