విజయ్ సేతుపతి సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం తమిళంలో ‘సంఘ తమిళన్’ పేరుతో తెరకెెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 15న విడుదలవుతోంది. ‘సైరా’తో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం అయిన నేపథ్యంలో తొలిసారిగా విజయ్ సినిమాను ఒకేసారి తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ సేతుపతి అనే పేరు ఇక్కడ పాపులరే కాబట్టి దాన్నే టైటిల్‌గా పెట్టి రిలీజ్ చేస్తున్నారు.
కథ
ఒక ఊరు, ఆ ఊరిలో కాపర్ ఫ్యాక్టరీ పెట్టాలని చూసే ఓ కార్పోరేట్ బిజినెస్‌మ్యాన్ రవి కిషన్, దానికి అండగా నిలిచే ఆ ఊరు ఎమ్మెల్యే చంటబ్బాయ్ (అశుతోష్ రాణా), వాటిని ఎదిరించేందుకు, ఊరి ప్రజలకు అండగా నిలిచేందుకు ఊరి పెద్ద దేవరాజ్(నాజర్), అతని కొడుకు విజయ్ సేతుపతి.. చివరకు ఏమైంది? సింగిల్ లైన్‌లో చెప్పాలంటే విజయ్ సేతుపతి కథ ఇదే. ఈ కథలో చరణ్, విజయ్ సేతుపతిలుగా నటించిన హీరో విజయ్ సేతుపతి కథ ఏంటి? రవి కిషన్ కూతరు కమలినీ (రాశీ ఖన్నా), యువరాణి (నివేదా పేతురాజ్) పాత్రల పరిధి ఏంటి? అన్నది కథ.