విజేత సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ దేవ్, మాలవిక నాయర్ ఇంకా తనికెళ్ల భరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణ మురళి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్(తమిళ నటుడు), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరిటీ, బద్రం, సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రలు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాకేష్ శశి వహిస్తున్నారు మరియు నిర్మాణ సంస్థ: సాయి కొర్రపాటి ప్రొడక్షన్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతం హర్షవర్దన్ రామేశ్వర్ అందించారు.
కథ
రామ్ (కల్యాణ్ దేవ్) ఇంజినీరింగ్ పూర్తి చేసి బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు. తండ్రి శ్రీనివాసరావు ఓ కంపెనీలో మామూలు ఉద్యోగి. కొడుకు స్థిరపడితే చూడాలనే ఆందోళనతో ఉంటాడు. ఓ సందర్భంలో ఆకట్టుకొని, ఎదురింట్లోకి అద్దెకు వచ్చిన జైత్ర (మాళవిక నాయర్) ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలో తనకు నచ్చిన పని చేయాలనే ఉద్దేశంతో లోకల్ బాయ్స్.. సర్ఫ్‌రైజ్ ప్లానర్ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని ప్రారంభిస్తాడు. రామ్ చేసిన ఓ పని కారణంగా తండ్రికి గుండెపోటు వస్తుంది. చెల్లెలి పెళ్లి కోసం భారీ కట్నం ఇవ్వాల్సిన సమస్య ఎదురవుతుంది. ఇదిలా ఉండగా, కుటుంబం కోసం తన తండ్రి తనకిష్టమైన వృత్తిని ఎంచుకోకుండా మాములు ఉద్యోగి మారుతాడనే విషయాన్ని రామ్ తెలుసుకొంటాడు. కుటుంబం కోసం శ్రీనివాసరావు త్యాగం చేసింది ఏమిటి? తండ్రి కోరికను కొడుకుగా రామ్ తీర్చడానికి ఏం చేశాడు. అనారోగ్యానికి పాలైన తండ్రిని ఎలా కాపాడుకొన్నాడు. తాను ప్రారంభించిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీతో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? జైత్ర ప్రేమ ఎక్కడి వరకు వచ్చింది? చెల్లెలి పెళ్లి కోసం రామ్ ఏం చేశాడు. చివరికి తండ్రి దృష్టిలో రామ్ హీరోగా ఎలా మారాడు అనే ప్రశ్నలకు సమాధానమే విజేత చిత్ర కథ.