విలన్ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్, ఐశ్వర్యరాయ్, పృథ్వీరాజ్, ప్రియమణి, కార్తీక్, ప్రభు, మున్నా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం నిర్వహించారు మరియు నిర్మాతలు మణిరత్నం, శారద నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
కట్టె..కొట్టే..తెచ్చే అన్నట్లు ఈ కథను చెప్పుకుంటే రావణ్ లాంటి గిరిజిన నాయకుడు వీరా(విక్రమ్)...ఎస్పీ దేవ్ (పృధ్వీరాజ్) భార్య రాగిణి(ఐశ్వర్య రాయ్)ని కిడ్నాప్ చేసి తన స్ధావరమైన నల్లమల అడవుల మద్య ఉన్న గ్రామానికి తెస్తాడు. సీతలాంటి ఆమెను వెతుక్కుంటూ రాముడు లాంటి దేవ్ అడవుల్లోకి తన టీమ్ తో బయిలుదేరతాడు. దేవ్ కి తోడుగా ఆంజనేయులు పాత్రలాంటి అడవులు తెలిసిన త్రాగుబోతు కానిస్టేబుల్ (కార్తీక్) వస్తాడు. ఆ వెతుకులాట ఓ ప్రక్క వీరా తన పరాక్రమంతో పోలీసుల స్దావరంపై జరిపి వారిని మట్టుపెట్టడం, పోలీసులు తమ యుక్తులతో వారిని వెతకటం మరోప్రక్క ఏ మాత్రం ఆసక్తి లేకుండా జరుగుతుంది. వీటికి తోడు అశోకవనంలో సీతలాంటి ఐశ్వర్య రాయ్ అప్పుడప్పుడూ దీనమైన ఎక్సప్రెషన్స్ ఇస్తూంటుంది. క్లైమాక్స్ కు చేరేసరకి వీరా స్ధావరాన్ని ఛేదించిన దేవ్ ఎలా పోరాటం చేసి తన భార్యని గెలుచుకున్నాడు. ఏ రకంగా రావణుడులాంటి వీరా గొప్పవాడిగా నిలచిపోయాడు అన్నది తెరపై చూడాల్సిందే.