X
విలన్

విలన్

Action | Drama | 18 Jun 2010 | U |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

విలన్ స్టోరీ

విలన్ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, పృథ్వీరాజ్‌, ప్రియమణి, కార్తీక్‌, ప్రభు, మున్నా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం నిర్వహించారు మరియు నిర్మాతలు మణిరత్నం, శారద నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమన్ స్వరాలు సమకుర్చారు. కథ కట్టె..కొట్టే..తెచ్చే అన్నట్లు ఈ కథను చెప్పుకుంటే రావణ్ లాంటి గిరిజిన నాయకుడు వీరా(విక్రమ్)...ఎస్పీ దేవ్ (పృధ్వీరాజ్) భార్య రాగిణి(ఐశ్వర్య రాయ్)ని కిడ్నాప్ చేసి తన స్ధావరమైన నల్లమల అడవుల మద్య ఉన్న గ్రామానికి తెస్తాడు. సీతలాంటి ఆమెను వెతుక్కుంటూ రాముడు లాంటి దేవ్ అడవుల్లోకి తన టీమ్ తో బయిలుదేరతాడు. దేవ్ కి తోడుగా ఆంజనేయులు పాత్రలాంటి అడవులు తెలిసిన త్రాగుబోతు కానిస్టేబుల్ (కార్తీక్) వస్తాడు. ఆ వెతుకులాట ఓ ప్రక్క వీరా తన పరాక్రమంతో పోలీసుల స్దావరంపై జరిపి వారిని మట్టుపెట్టడం, పోలీసులు తమ యుక్తులతో వారిని వెతకటం మరోప్రక్క ఏ మాత్రం ఆసక్తి లేకుండా జరుగుతుంది. వీటికి తోడు అశోకవనంలో సీతలాంటి ఐశ్వర్య రాయ్ అప్పుడప్పుడూ దీనమైన ఎక్సప్రెషన్స్ ఇస్తూంటుంది. క్లైమాక్స్ కు చేరేసరకి వీరా స్ధావరాన్ని ఛేదించిన దేవ్ ఎలా పోరాటం చేసి తన భార్యని గెలుచుకున్నాడు. ఏ రకంగా రావణుడులాంటి వీరా గొప్పవాడిగా నిలచిపోయాడు అన్నది తెరపై చూడాల్సిందే.
Read More

విలన్ కాస్ట్ & క్రూ

విలన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మణిరత్నం
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత మణిరత్నం
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

విలన్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మామూలుగానే మణిరత్నం చిత్రం అనగానే ప్రత్యేకమైన ఎక్సపెక్టేషన్స్, అందులోనూ విక్రమ్ వంటి అద్బుతమైన నటనా పటిమ ఉన్న స్టార్, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్య కాంబినేషన్ అనగానే ఇక చెప్పుకునేదేముంది. అయితే ఆకాశాన్ని అంటే ఆ అంచనాలను అందులేకపోక కూలబడ్డాడు విలన్. రామాయణాన్ని మోడ్రనైజ్ చేస్తూ అల్లుకున్న కథే సినిమాను దెబ్బకొట్టింది. ఎందుకంటే ఆ కథలో ప్రతీ అంశమూ అందరీ పరిచయమనేది ఒకెత్తు అయితే ఇలాంటి సినిమాలు(ఖల్ నాయక్) ఇంతకుముందు కూడా చాలా వచ్చేయి. దాంతో నెక్స్ట్ పదో సీన్ లో ఏమి జరుగుతుందనేది అందరికీ చాలా ఈజీగా ఊహించే స్దితికి చేరుకుని ఆసక్తి చంపేసింది. అయితే విక్రమ్ నటనస, మణిరత్నం సినిమాని ఓ విజువల్ పోయిట్రీలా తీర్చిదిద్దిన తీరు మాత్రం మెచ్చుకోకుండా ఉండలేమనిపిస్తుంది. సినిమా ప్రియులకు ఈ చిత్రం ఓకే అనిపిస్తే...సినిమాని. వినోదంగా చూసే వారికి ఎక్కడా ఫన్ లేని, సీన్స్ లో బిగువులేని, కథలో డెప్త్ కనపడని ఈ చిత్రం కష్టమనిపిస్తుంది. దాంతో చాలామందికి మణిరత్నం ఈ చిత్రం తియ్యకుండా ఉండే బావుండేది అనిపించటంలో ఆశ్చర్యం లేదు.

విలన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

విలన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+