వినాయకుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కృష్ణుడు, సోనియా, పూనమ్ కౌర్, సూర్య తేజ్, జ్యోతి, ఆదర్శ్, మురళీకృష్ణ, ప్రేమ కుమార్ పత్రా, సామ్రాట్, తులసి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కధ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:సాయి కిరణ్ అడవి నిర్వహించారు మరియు నిర్మాత సరిత పట్రా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సామ్ ప్రసేష్ స్వరాలు సమకుర్చారు.
కథ
భారీకాయం గల కార్తీక్(కృష్ణుడు) సిటీకి జాబ్ కోసం వచ్చిన కుర్రాడు. నాజూగ్గా ఉన్న కల్పన(సోనియా) అక్కడే ఆల్రెడీ జాబ్ చేస్తున్న మోడ్రన్ సిటీ గర్ల్. ఆమెకు జూనియర్ గా కార్తీక్ చేరుతాడు. మొదటి చూపులోనే కార్తీక్ కి ఆమెపై మనస్సు కలిగితే,కల్పనకి అతనంటే ఏహ్య భావం కలుగుతుంది. ఇది చాలదన్నట్లు మరో ప్రక్క కల్పనకు ఆమె ఇంట్లో వాళ్ళు ఓ అందమైన సాఫ్ట్ వేర్ కుర్రాడితో మ్యారేజ్ ప్రపోజల్ పెడతారు. ఇలా ఈ ఇద్దరి మధ్య ప్రేమ,పెళ్ళి వంటివి అసాధ్యం అనుకున్న స్ధితిలో వాళ్లు ప్రేమికులు ఎట్లా అయ్యారు అంటే...సినిమా చూడాల్సిందే.