విరాట పర్వం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రానా, సాయిపల్లవి, నందిత దాస్, ప్రియమణి, నివేత, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వేణు ఉడుగుల వహించారు. ఈ చిత్రానికి సంగీతం సుధాకర్ చెరుకూరి అందించారు.
కథ
రవన్న అలియాస్ అరణ్య (రానా దగ్గుబాటి) రాసిన విప్లవ సాహిత్యానికి వెన్నెల (సాయి పల్లవి) ప్రభావితం కావడమే కాకుండా ఆయనపై ప్రేమను పెంచుకొంటుంది. రవన్నను స్పూర్తిగా తీసుకొని నక్సలైట్ దళంలో చేరాలని ప్రయత్నిస్తుంటుంది. మేన బావ (రాహుల్ రామకృష్ణ)ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇంట్లో ఎవరికి చెప్పకుండా రవన్న దళాన్ని కలిసేందుకు అడవుల్లోకి వెళ్తుంది. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన రవన్నను కలుసుకొనేందుకు వెన్నెల ఎలాంటి కష్టాలు పడింది. రవన్నను కలుసుకొనే క్రమంలో వెన్నెలకు ఎదురైన చేదు అనుభవాలు ఏంటి? వెన్నెల ప్రేమను రవన్న ఆమోదించాడా? ఒకవేళ రవన్న ప్రేమను గెలుచుకొంటే.. ఆమె దళంలో చేరిందా? దళంలో చేరిన తర్వాత వెన్నెలకు ఎదురైన సమస్యలు ఏమిటి? రవన్న, వెన్నెల ప్రేమ కథకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే విరాటపర్వం కథ.