వాంటెడ్ పండుగాడ్ (2022)(U/A)
Release date
19 Aug 2022
genre
వాంటెడ్ పండుగాడ్ స్టోరి
వాంటెడ్ పండుగాడ్ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, సుధీర్, దీపికా పిల్లి, వర్షని, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, అనసూయ, బ్రహ్మానందం, నిత్య శెట్టి, హేమ, విష్ణు ప్రియా, షకలక శంకర్, తనికెళ్ళ భరణి, పృథ్వి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీధర్ సీపాన వహించారు. నిర్మాత వెంకట్ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం పి ఆర్ (పెద్దపల్లి రోహిత్) అందించారు.
కథ
పాండు అలియాస్ పండు సునీల్ చంచల్ గూడా జైలు నుంచి తప్పించుకుని నర్సాపురం ఫారెస్ట్‌లో దాక్కున్నాడని మీడియాలో వార్తలు వస్తాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరొందని పండును పట్టుకున్న వారికి రూ. కోటి బహుమానంగా ప్రకటిస్తారు. ఈ వార్తలు చూసి పండును పట్టుకునేందుకు భిన్న నేపథ్యాలు, అవసరాలు కలిగిన సుధీర్ (సుడిగాలి సుధీర్), D (దీపికా పిల్లి), అఖిల్ చుక్కనేని వెన్నెల కిశోర్, విక్రమ్ రాథోడ్ (సప్తగిరి), బోయపాటి బాలయ్య (శ్రీనివాస్ రెడ్డి), మణిముత్యం (తనికెళ్ల భరణి), హాసిని (ఆమని) అడవిలో వెతుకుతుంటారు. మరి వారికి పండు దొరికాడా? వారిని పట్టుకునే క్రమంలో జరిగిన సంఘటనలు ఏంటి? పండుగాడు కాస్త పండు'గాడ్' ఎలా అయ్యాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie వాంటెడ్ పండుగాడ్ with us? Please send it to us ([email protected]).