వేర్ ఈజ్ విద్యాబలన్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రిన్స్, జోతిల్ సేథి, సంపూర్ణేష్ బాబు, రావు రమేష్, అశిశ్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి, తాగుబోతు రమేష్, మధు నందన్, రవి వర్మ, పంకజ్ కెసరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు వేణు గోపాల్ రెడ్డి, పి లక్ష్మి నరసింహా రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కమ్రాన్ అహ్మద్ స్వరాలు సమకుర్చారు.
కథ
పిజ్జా సెంటర్ లో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతూంటాడు కిరణ్( ప్రిన్స్). డాక్టర్ స్వాతి(జ్యోతి సేథ్)తో ప్రేమలో పడతాడు. స్వాతి బంధువు వాల్తేర్ వాసు(మధునందన్) వీరిని విడగొట్టాలని చూస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు వెనక మినిస్టర్ పులి నాయుడు(జయప్రకాష్ రెడ్డి), డాన్ గంటా (సంపూర్ణేష్ బాబు) ఉంటారు. విద్యాబాలన్ ఫోన్ కోసం ఈ మర్డర్ జరుగుతుంది. అసలు ఆ ఫోన్లో ఏ ముంది? ఆ కేసు నుంచి కిరణ్, వాల్తేర్ వాసు ఎలా బయిటపడ్డారు. కిరణ్ కు పోలీస్ అధికారి నీలకంఠ(ఆశిష్ విద్యార్ది) ఎలా సహాయపడ్డాడు, చివరకు ఏమంది అనేది తెరపై చూడాల్సిందే.