వైల్ట్ డాగ్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అక్కినేని నాగార్జున, దియా మీర్జా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అహిషోర్ సాల్మోన్ వహించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. కిరణ్ కుమార్ డైలాగ్స్ రాశారు. షానియల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు.
కథ
ఎన్ఐఏ సీనియర్ ఆఫీసర్ విజయ్ వర్మ (నాగార్జున). కొన్ని కారణాల వల్ల విజయ్ వర్మను సస్పెండ్‌ను చేస్తారు. పుణెలో జరిగిన బాంబ్ బ్లాస్ కేసు అంతు చిక్కకుండా ఉంటుంది. దాన్ని పరీష్కరించేందుకు విజయ్ వర్మను రంగంలోకి దించేందుకు పై అధికారులు ప్రయత్నిస్తుంటారు. చివరకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌కు ఎన్ఐఏ అధికారులు ఒప్పుకుంటారు. అలా కేసును టేకప్ చేసిన విజయ్ వర్మను కొన్ని కారణాల వల్ల మళ్లీ సస్పెండ్ చేస్తారు. విజయ్ వర్మను ఎందుకు సస్పెండ్ చేశారు? పుణె కేసును శోధించే క్రమంలో విజయ్ వర్మకు తెలిసిన నిజాలు ఏంటి? మళ్లీ సస్పెండ్ అయిన విజయ్ వర్మ తాను టేకప్ చేసిన కేసును ఎలా పరిష్కరించాడు? అసలు పుణె బాంబ్ బ్లాస్ట్ వెనుకున్నది ఎవరు? అతడిని చివరకు విజయ్ వర్మ ఏం చేశాడు? వంటి ఆసక్తికరమైన అంశాలకు సమాధానమే వైల్డ్ డాగ్.