X
యముడు 3
Action | Romance | 09 Feb 2017 |
Telugu

యముడు 3 స్టోరీ

యముడు 3 సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకుమార్, అనుష్క, శృతి హాసన్, తాకుర్ అనూఫ్ సింగ్, సూరి, రోబో శంకర్, క్రిష్, రాధిక శరత్ కుమార్, నాజర్, రాధా రవి, విజయకుమార్, శరత్ సక్షేనా, నితిన్ సత్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హారి నిర్వహించారు మరియు నిర్మాతలు మల్కపురం శివకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్ స్వరాలు సమకుర్చరు. 

కథ

ఏపీ కేడర్ కు చెందిన నరసింహ (సూర్య) సీబీఐ కు ప్రమోట్ అయ్యి...మంగుళూరు కు ఓ ఎస్సైన్ మెంట్ పనిమీద డెప్యుటేషన్ మీద వెళ్తాడు . అలా నరసింహం ను పిలిపించేది కూడా సామాన్యమైన వ్యక్తి కాదు..కర్ణాటక హోం మంత్రి (శరత్ బాబు) . ఇంతకీ అంత పనేంటి మన నరసింహంతో అంటారా... మంగుళూరు సిటీ పోలీస్ కమీషనర్ మర్డర్ అవుతారు. ఆ కేసుని ఇన్విస్టిగేట్ చేయటానికి అన్నమాట. ఈ ఇన్విస్టిగేషన్ లో సూర్య తెలుసుకునేది ఏమిటీ అంటే... లోకల్ మాఫియా డాన్ ఎఎస్ రెడ్డి (శరద్ సక్సేనా) పోలీస్ కమీషనర్ ని మర్డర్ చేసారని తెలుస్తుంది. ఈ కేసుని తనదైన శైలిలో విచారించి క్లోజ్ చేద్దామనుకునే సమయంలో అతనికి కొన్ని ఊహించని నిజాలుతెలుస్తాయి. కమీషనర్ హత్య కు మించిన పెద్ద క్రైమ్ అందులో ఇన్వాల్స్ అయ్యిందని గ్రహిస్తాడు. మరింతగా తవ్వుకుంటూ వెళ్తే...మైనింగ్ కు చెందిన పెద్ద వ్యాపారస్తుడు విఠల్ ప్రసాద్ (అనూప్ సింగ్) ఈ హత్య వెనుక ఉన్నాడని రివీల్ అవుతుంది. అతను ఆస్ట్రేలియాలో ఉంటూంటాడు. అతను ఓ పెద్ద మెడికల్ వేస్ట్ కు చెందిన మాఫియా నెట్ వర్క్ ని ఆపరేట్ చేస్తున్నాడని తెలుస్తోంది. అది తెలుసుకున్న నరసింహ పూర్తి యాక్షన్ లోకి దిగుతాడు. అక్కడనుంచి ఈ మాఫియాను అంతమొందించటానికి మన హీరో సూర్య కంకణం కట్టుకుంటాడు. ఈ కేసును పూర్తి చేయడం తన పర్సనల్ మిషన్‌గా పెట్టుకున్న నరసింహ ఏం చేశాడు? ఆస్ట్రేలియాలో ఉండే విఠల్‍పై ఎలా పోరాడాడనే విషయమై సెకండాఫ్ రన్ అవుతుంది. అసలు అంత పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా కి లోకల్ గా ఉండే మంగళూరు మాఫియా కి మధ్య కనెక్షన్ ఏమిటి... విఠల్ ని ఎలా శిక్షించాడు. ఈ కథలో అగ్ని (శృతి హాసన్) ఎవరు? నరసింహ, తన భార్య కావ్య (అనుష్క)కు దూరంగా ఉన్నట్లు ఎందుకు నటిస్తాడు? లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+