X
యముడు 3

యముడు 3

Action | Romance | 09 Feb 2017 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

యముడు 3 స్టోరీ

యముడు 3 సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకుమార్, అనుష్క, శృతి హాసన్, తాకుర్ అనూఫ్ సింగ్, సూరి, రోబో శంకర్, క్రిష్, రాధిక శరత్ కుమార్, నాజర్, రాధా రవి, విజయకుమార్, శరత్ సక్షేనా, నితిన్ సత్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హారి నిర్వహించారు మరియు నిర్మాతలు మల్కపురం శివకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్ స్వరాలు సమకుర్చరు.  కథ ఏపీ కేడర్ కు చెందిన నరసింహ (సూర్య) సీబీఐ కు ప్రమోట్ అయ్యి...మంగుళూరు కు ఓ ఎస్సైన్ మెంట్ పనిమీద డెప్యుటేషన్ మీద వెళ్తాడు . అలా నరసింహం ను పిలిపించేది కూడా సామాన్యమైన వ్యక్తి కాదు..కర్ణాటక హోం మంత్రి (శరత్ బాబు) . ఇంతకీ అంత పనేంటి మన నరసింహంతో అంటారా... మంగుళూరు సిటీ పోలీస్ కమీషనర్ మర్డర్ అవుతారు. ఆ కేసుని ఇన్విస్టిగేట్ చేయటానికి అన్నమాట. ఈ ఇన్విస్టిగేషన్ లో సూర్య తెలుసుకునేది ఏమిటీ అంటే... లోకల్ మాఫియా డాన్ ఎఎస్ రెడ్డి (శరద్ సక్సేనా) పోలీస్ కమీషనర్ ని మర్డర్ చేసారని తెలుస్తుంది. ఈ కేసుని తనదైన శైలిలో విచారించి క్లోజ్ చేద్దామనుకునే సమయంలో అతనికి కొన్ని ఊహించని నిజాలుతెలుస్తాయి. కమీషనర్ హత్య కు మించిన పెద్ద క్రైమ్ అందులో ఇన్వాల్స్ అయ్యిందని గ్రహిస్తాడు. మరింతగా తవ్వుకుంటూ వెళ్తే...మైనింగ్ కు చెందిన పెద్ద వ్యాపారస్తుడు విఠల్ ప్రసాద్ (అనూప్ సింగ్) ఈ హత్య వెనుక ఉన్నాడని రివీల్ అవుతుంది. అతను ఆస్ట్రేలియాలో ఉంటూంటాడు. అతను ఓ పెద్ద మెడికల్ వేస్ట్ కు చెందిన మాఫియా నెట్ వర్క్ ని ఆపరేట్ చేస్తున్నాడని తెలుస్తోంది. అది తెలుసుకున్న నరసింహ పూర్తి యాక్షన్ లోకి దిగుతాడు. అక్కడనుంచి ఈ మాఫియాను అంతమొందించటానికి మన హీరో సూర్య కంకణం కట్టుకుంటాడు. ఈ కేసును పూర్తి చేయడం తన పర్సనల్ మిషన్‌గా పెట్టుకున్న నరసింహ ఏం చేశాడు? ఆస్ట్రేలియాలో ఉండే విఠల్‍పై ఎలా పోరాడాడనే విషయమై సెకండాఫ్ రన్ అవుతుంది. అసలు అంత పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా కి లోకల్ గా ఉండే మంగళూరు మాఫియా కి మధ్య కనెక్షన్ ఏమిటి... విఠల్ ని ఎలా శిక్షించాడు. ఈ కథలో అగ్ని (శృతి హాసన్) ఎవరు? నరసింహ, తన భార్య కావ్య (అనుష్క)కు దూరంగా ఉన్నట్లు ఎందుకు నటిస్తాడు? లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Read More

యముడు 3 కాస్ట్ & క్రూ

యముడు 3 సిబ్బంది సమాచారం

దర్శకత్వం హరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత మార్కాపురం శివకుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

యముడు 3 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమా లో స్పెషాలిటీ ఏమిటంటే సూపర్ ఫాస్ట్ గా నడిచే స్క్రీన్ ప్లే. ఏం జరుగుతోందో అర్దమయ్యే లోగా చాలా సీన్స్ గడిచిపోతాయి. ఎక్కడా లాగ్ కానీ, చిన్న బోరింగ్ మూవ్ మెంట్ కానీ ఉండదు. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్స్, చాలా లౌడ్ గా ఉండే బ్యాగ్రౌండ్ స్కోర్ రెగ్యులర్ ఆడియన్స్ కు కాస్త ఇబ్బంది పెడతాయి. అయితే సింగం సీరిస్ నిలబెట్టాలంటే ఆ మాత్రం ఉండాలనకున్నట్లున్నాడు దర్శకుడు హరి. ఛేజింగ్‌లు.. సూర్య చేసిన ఫైట్లు.. పోలీసు పవర్‌ను చూపించిన డైలాగ్‌లు ఇవన్నీ కలిసి ఓ యాక్షన్‌ ప్యాకేజీలా దర్శకుడు చూపించాడు. మొదటి రెండు భాగాల్లో ముఖ్యంగా మొదటి భాగంలో దర్శకుడు ఎక్కువగా బాగా ఛార్జ్ చేసిన ఎలివేషన్ సీన్స్ ఉండేటట్లు చూసుకుని సక్సెస్ అయ్యాడు. కానీ మూడో పార్ట్ కు వచ్చేసరికి కేవలం కొన్ని సీన్స్ లోనే ఆ ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఎయిర్ పోర్ట్ లో చేసిన సీన్ చాలా హైలెట్ గా నిలిచింది. ఆస్ట్రేలియాలో జరిగే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఫస్టాఫ్ కన్నా సెకండాప్ పట్టుగా సాగింది. కాకపోతే దర్శకుడు తొలి రెండు భాగాల్లో చూపించి గ్రిప్ ఈ సినిమాలో చూపించలేకపోయాడు.

యముడు 3 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

యముడు 3

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+